తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మద్యం అమ్మకాలకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ శాఖ తాజాగా వెల్లడించింది. సంవత్సర కాలంలో సుమారు రూ.35 వేల కోట్ల ఆదాయం.. మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ఖజానాకు చేకూరిందంటే.. లిక్కర్ అమ్మకాలు తెలంగాణలో ఏ రేంజ్‌లో నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ప్రభుత్వం కొత్త బ్రాండ్లను ఆహ్వానించిన నేపథ్యంలో.. దేశీయ, విదేశీ మద్యం కంపెనీల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వందల సంఖ్యలో కొత్త బ్రాండ్ల అమ్మకాల అనుమతుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
Also Read:Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
కాదా.. మద్యం అమ్మకాల అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని సమాచారం. మొత్తం 604 కొత్త మద్యం బ్రాండ్లకు అమ్మకాల అనుమతులు కోరుతూ 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ దరఖాస్తుల సంఖ్య చూస్తేనే.. తెలంగాణలో లిక్కర్ అమ్మాకల్లో పోటీ ఏ స్థాయికి చేరింది అన్నది ఇట్టే తెలిసిపోతుంది.
Also Read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది
ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం మేరకు.. ఇప్పటివరకు వచ్చిన ఈ దరఖాస్తుల్లో 331 బ్రాండ్లు దేశీయంగా తయారయ్యే ఇండియన్ మెడ్ లిక్కర్ కు చెందినట్టుగా తెలుస్తోంది. అంటే దేశీయ బ్రాండ్లకు తెలంగాణ రాష్ట్రం కీలక మార్కెట్‌గా మారుతోందని స్పష్టమవుతోంది. స్థానికంగా తయారయ్యే మద్యం బ్రాండ్లకి వాణిజ్యంగా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు.. 273 బ్రాండ్లు విదేశీ మద్యం కు చెందినవిగా తెలుస్తోంది. గ్లోబల్ లిక్కర్ కంపెనీలు తెలంగాణ మార్కెట్‌లోకి ప్రవేశించి తమ ఉనికిని పెంచుకునేందుకు ఆసక్తిగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. భారతదేశంలో స్పీడ్‌గా ఎదుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా ఉంది. దీంతో విదేశీ కంపెనీలు ఇక్కడ తమ బ్రాండ్లకు మార్కెట్ ఏర్పాటుచేయాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నాయి.
ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 47 కొత్త కంపెనీలు 386 బ్రాండ్లకు అనుమతులు కోరినట్టు సమాచారం. అలాగే 45 పాత కంపెనీలు 218 బ్రాండ్లకి అనుమతులు కోరినట్టు తెలుస్తోంది. వెల్లువలా వస్తున్న దరఖాస్తులను చూస్తుంటే.. కొత్త కంపెనీలు కూడా తెలంగాణ లిక్కర్ మార్కెట్లో స్థానం సంపాదించేందుకు ఎంత ఉత్సాహంగా ఉన్నాయో తెలుస్తోంది.
అయితే.. తెలంగాణలో మద్యం అమ్మకాలు ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్నాయి. కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం మరింతగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వానికి లిక్కర్ నుంచి వచ్చే ఆదాయం ప్రధాన వనరుగా గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది.అయితే.. ఈ కొత్త బ్రాండ్ల అనుమతుల ప్రక్రియకు సంబంధించి అధికారుల పరిశీలన, నియంత్రణ చర్యలు కీలకంగా మారనున్నాయి. అప్రామాణిక బ్రాండ్లు, నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌లోకి రావాటాన్ని నివారించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
Also Read:Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు
liquor | telangana | telangana liquor sales | telangana-liquor-shops-tenders | telangana liquor production increase | latest-news | telugu-news | latest telugu news updates