Pakisthan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. అక్రమ వలసదారులకు పాకిస్థాన్ వార్నింగ్ పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులు వెంటనే వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 1వ తేదీలోగా స్వచ్ఛందగా దేశం విడిచి వెళ్లాలని లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్థాన్ తాత్కాలిక అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. By B Aravind 27 Oct 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులకు పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 1లోగా తమ దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని గురువారం ఓ అల్టిమేటమ్‌ను జారీ చేసింది. ఒకవేళ వెళ్లకపోతే వారిని గుర్తించి చర్యులు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు అక్రమ వలసదారులకు ఎవరైనా షెల్టర్ ఇస్తే వారిపై కూడా చట్టపరంగా శిక్షిస్తామని పేర్కొంది. ఈ మేరకు పాకిస్థాన్ తాత్కలిక అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే పాకిస్థాన్‌లోని వేలాది మంది ఆఫ్ఘానిస్థాన్ జాతీయులతో పాటు అక్రమంగా దేశంలో ఉంటున్న వలసదారులందరూ కూడా నవంబర్ 1న గడువు కంటే ముందే స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని.. తాత్కాలిక అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బూగ్తీ పేర్కొన్నారు. Also Read: ఇజ్రాయెల్‌పై దాడికి ముందు ఆ దేశం హమాస్ మిలిటెంట్లకు శిక్షణ ఇక నవంబర్ 1 తర్వాత సరైన పత్రాలు లేని వలసదారులందర్నీ తొలగించే ప్రక్రియతో ముందుకు వెళ్లాలని పాకిస్థాన్ ధృఢనిశ్చయంతో ఉందని మీడియాతో చెప్పారు. ఇప్పటికే కొంతమంది అక్రమ వలసదారులను గుర్తించామని.. తమ వద్ద ఇప్పటికే వారికి సంబంధించిన సమాచారం ఉందని చెప్పారు. మరోవైపు ఈ ఏడాది పాకిస్థాన్‌లో దాదాపు 24 ఆత్మహుతి బాంబు దాడులు జరిగాయి. అంతేకాదు.. ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా జరిగిన 14 దాడులు, నేరాలు, స్మగ్లింగ్‌కు స్పందించిన కార్యకలాపాల్లో వారి ప్రమేయం ఉన్నట్లు పాకిస్థాన్ అధికారులు ఇటీవల గుర్తించారు. అందుకే అక్రమ వలసదారులను దేశం నుంచి వెళ్లగొట్టే ప్రణాళికపై పాకిస్థాన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. #telugu-news #pakisthan #pakisthan-news #illeagal-migrants మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి