Telangana : సీఎం రేవంత్‌ను కలవనున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. ఎందుకంటే తన నియోజకవర్గంలో 118 జీవో సమస్య ఉందని.. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ను కలుస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. అలాగే నిజమైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు లేవని.. ఈ విషయంలో టీడీపీ,కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పిదాల వల్ల ప్రజలు నష్టపోయారని అన్నారు. By B Aravind 10 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి LB Nagar : ఎల్బీనగర్(LB Nagar) ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(Sudheer Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో 118 జీవో సమస్య ఉందని.. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్(CM Revanth) ను కలుస్తానని అన్నారు. ఈ విషయంపై ఆయను వివరిస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడంలో తప్పు లేదన్నారు. అలాగే నిజమైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు లేవని అన్నారు. రేషన్ కార్డుల(Ration Cards) విషయంలో గత ప్రభుత్వాలైన టీడీపీ,కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) తప్పిదాల వల్ల ప్రజలు నష్టపోయారని అన్నారు. ఈ విషయాన్ని గతంలో కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని.. ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు ఇవ్వాలని అనుకున్నామని తెలిపారు. Also Read : నేడే తెలంగాణ బడ్జెట్ మరోవైపు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు(6 Guarantees) పూర్తి స్థాయిలో అమలవుతాయనే సందేహం అందిరిలో ఉందని సుధీర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అరగంట కరెంట్ కట్ అయితే.. బీఆర్‌ఎస్ గ్రాఫ్ పెరుగుతుందని అన్నారు. గతంలో తమ ప్రభుత్వం వేసవి కాలంలో కూడా ఎలాంటి పవర్ కట్‌లు లేకుండా విద్యుత్ అందిచామని అన్నారు. బీఆర్‌ఎస్‌కు పార్లమెంటులో ఎన్నిసీట్లు వచ్చిన ఫరాక్ పడదు. అయితే ఇటీవల అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించడంతో.. నెలరోజుల్లో బీజేపీ గ్రాఫ్ పెరిగిపోయిందని సుధీర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలే ఎజెండాగా బడ్జెట్ ఉందని..పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజలకు భ్రమలు కల్పిస్తారని వ్యాఖ్యానించారు. Also Read : నేడు అసెంబ్లీకి రానున్న కేసీఆర్.. తొలి ప్రసంగంపై ఉత్కంఠ #telugu-news #telangana-news #cm-revanth-reddy #telangana-politics #lb-nagar-mla-sudheer-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి