Jamili Elections: 2029 నుంచి జమిలి ఎన్నికలు..! కేంద్రానికి ప్రతిపాదన చేయనున్న లా కమిషన్

దేశంలో జమిలి ఎన్నికలు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. అయితే జమిలి ఎన్నికల నిర్వహణపై 'లా కమిషన్‌' మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది.

New Update
Jamili Elections: 2029 నుంచి జమిలి ఎన్నికలు..! కేంద్రానికి ప్రతిపాదన చేయనున్న లా కమిషన్

లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే ఇటీవల జమిలి ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహిస్తారనే ప్రచారాలు కూడా జోరుగా సాగాయి. అయితే దీనిపై అధ్యయనం చేసేందుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై కమిటీ కూడా వేసింది. జమిలి ఎన్నికల నిర్వహణపై 'లా కమిషన్‌' మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Also read: పెళ్లి ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడం మోసం కాదు: సుప్రీంకోర్టు

2029లో మే-జూన్‌ మధ్య ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా లా కమిషన్ ప్రతిపాదించనున్నట్లు సమాచారం. అయితే ఈ ఎన్నికలను ఇలా ఒకేసారి నిర్వహించేందుకు రాజ్యాంగంలోని కొత్త అధ్యయాన్ని చేర్చేలా సవరణలు తీసుకురావాలని కమిషన్ సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది.లా కమిషన్‌ ఎలాంటి అంశాలు సిఫార్సు చేయనుంది అనేదానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన ప్రకారం లా కమిషన్‌ సిఫార్సు చేయనున్న ముఖ్యాంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1.రాజ్యాంగంలో కొత్తగా చేర్చే చాప్టర్‌లో ఏకకాల ఎన్నికలు, పంచాయతీ, మున్సిపాలిటీ, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సరిపోయేలా ఉమ్మడి ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలుండాలి.

2. రాష్ట్ర అసెంబ్లీలకు సంబంధించి ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న నిబంధనలను భర్తీ చేసేలా కొత్త అధ్యయనాన్ని తయారుచేయాలి.3.

3. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే వీలుగా.. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రల అసెంబ్లీ గడువులను మూడు దశల్లో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ కాల వ్యవధిని పొడగించడం, మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ కాల వ్యవధిని తగ్గించడం చేయాలి.4.

4. ఒకవేళ ఏదైన రాష్ట్రంలో అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాలు కూలిపోయినా లేదా హంగ్ ప్రభుత్వాలు ఉన్నా.. ఆ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది కుదరకపోతే.. ఆ అసెంబ్లీ మిగతా కాల వ్యవధికి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి.

ఈ ముఖ్యాంశాలు లా కమిషన్‌ కేంద్రానికి సిఫార్సు చేయనున్నట్లు పలు వర్గాలు తెలిపాయి.

Also Read: సచిన్‌ జమ్మూ పర్యటన.. ప్రధాని మోదీ ఏమన్నారంటే

Advertisment
Advertisment
తాజా కథనాలు