🔴UNION BUDGET 2026 LIVE UPDATES: నేడే కేంద్ర బడ్జెట్.. తగ్గేవి, పెరిగేవి ఇవే!

మరికొన్ని గంటల్లో కేంద్రం 2026-27 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.

author-image
By Manoj Varma
New Update
union budget

  • Feb 01, 2026 21:24 IST

    Budget 2026: MGNREGAతో పోలిస్తే, జీ రామ్ జీ స్కీమ్ కు భారీగా నిధులు.. ఉపాధి హామీకి ఎంత బడ్జెటో తెలుసా?

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్‌కు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్తగా మార్చిన ఉపాధి హామీ పథకమనైన "వికాసిత్ భారత్-జీ రామ్ జీ'' కోసం రూ.95,692 కోట్లు బడ్జెట్‌ కేటాయించారు.

    Over 95,000 crores allocated for VB-G RAM G, MGNREGA gets 30,000 crores in Budget
    Over 95,000 crores allocated for VB-G RAM G, MGNREGA gets 30,000 crores in Budget



  • Feb 01, 2026 18:42 IST

    Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు దక్కేవి ఇవే.. పూర్తి వివరాలు

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కలిసొచ్చేలా కొన్ని ప్రకటనలు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

    What are the advantages to telugu states in union budget 2026
    What are the advantages to telugu states in union budget 2026



  • Feb 01, 2026 17:11 IST

    Budget 2026: బడ్జెట్‌పై విపక్షాల మండిపాటు.. ఎవరేమన్నారంటే?

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ బడ్జెట్ సామాన్యులకు శూన్యమని, కేవలం అంకెలు మార్చిన పాత పథకాల సమాహారమని విమర్శించాయి.

    Budget 2026



  • Feb 01, 2026 15:00 IST

    Budget 2026: బడ్జెట్‌తో భారీగా తగ్గనున్న ధరలు ఇవే!

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27 సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా ఉంది. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూ, దిగుమతి సుంకాలు సవరిస్తున్న నిర్ణయాలతో పలు నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

    nirmama



  • Feb 01, 2026 13:35 IST

    ఆరోగ్య రంగానికి రూ.10,000 కోట్లు.. బయోఫార్మా హబ్‌గా భారత్!

    ఈ ఏడాది బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అగ్రతాంబూలం ఇచ్చారు. దేశాన్ని బయోఫార్మాస్యూటికల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భారీ కేటాయింపులు చేసింది. ఇండియాని ప్రపంచ బయోఫార్మాస్యూటికల్ కేంద్రంగా మార్చేందుకు బయోఫార్మా శక్తి అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.

    Biopharma Shakti scheme



  • Feb 01, 2026 13:34 IST

    సీఎన్‌జీ కార్లు, ఆటోలకు నిర్మలమ్మ గుడ్ న్యూస్! .. ఇక పండగే!

    కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  లోక్సభలో ప్రవేశ పెట్టారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా బడ్జెట్‌లో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు.

    Auto and car



  • Feb 01, 2026 13:16 IST

    బడ్జెట్‌లో పెరిగేవి.. తగ్గేవి ఇవే..

    • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేశారు.
    • దీంతో కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి, మరికొన్ని తగ్గనున్నాయి.
    • పెరిగేవి: విదేశీ మద్యం, లగ్జరీ వాచ్‌లు
    • తగ్గేవి:క్యాన్సర్‌ ఔషధాలు, డయాబెటిక్‌ మందులు, ఈవీ బ్యాటరీలు, సోనాల్‌ ప్యానల్స్‌, విదేశీ యాత్రలపై పన్ను, మైక్రో అవెర్స్‌, విదేశీ విద్య, చెప్పులు, ఎయిర్‌క్రాఫ్ట్‌ విడిభాగాలు
    • వీటితో పాటు దేశీయంగా తయారయ్యే మొబైల్స్‌, ట్యాబ్లెట్‌ ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది.



  • Feb 01, 2026 13:00 IST

    BUDGET 2026: ఏపీ నుంచి చైనాపై అటాక్.. బడ్జెట్లో సంచలన ప్రకటన!

    భవిష్యత్తు అవసరాలకు అత్యంత కీలకమైన 'అరుదైన భూమి లోహాల' వెలికితీత, ప్రాసెసింగ్‌పై భారీ ప్రకటన చేశారు. ఈ లోహాలు భూమి పొరల్లో భారీగా ఉన్నప్పటికీ, వాటి ప్రాసెసింగ్ అత్యంత క్లిష్టమైన, ఖరీదైన ప్రక్రియ. అందుకే వీటిని 'అరుదైనవి' అని అంటారు.

    _Rare Earth Corridors



  • Feb 01, 2026 12:35 IST

    తగ్గనున్న సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు

    కేంద్ర బడ్జెట్ 2026-27
    * తగ్గనున్న సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు
    * సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలపై సుంకం రద్దు
    * విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై సుంకాలు మినహాయింపు
    * విమానాల విడిభాగాలపైనా సుంకం రద్దు



  • Feb 01, 2026 12:29 IST

    ముగిసిన నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం

    • 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
    • దాదాపు 80 నిమిషాలకు పైగా ఆమె ప్రసంగం సాగింది.



  • Feb 01, 2026 12:27 IST

    క్యాన్సర్‌ రోగులు ఉపయోగించే 17 ఔషధాలపై పన్ను తగ్గింపు

    • సెంట్రల్‌ ఎక్సైజ్‌ నుంచి బయో గ్యాస్‌ ద్వారా ఉత్పత్తయ్యే సీఎన్‌జీకి మినహాయింపు
    • మైక్రో అవెన్స్‌పై పన్ను తగ్గింపు
    • పౌర విమానాల విడిభాగాలపై పన్ను తగ్గింపు

    * 17 రకాల క్యాన్సర్ మందుల ధరలు తగ్గింపు
    * 17 రకాల క్యాన్సర్ మందులపై దిగుమతి సుంకం 20 నుంచి 10 శాతానికి తగ్గింపు
    * క్యాన్సర్ మందుల దిగుమతులపై కస్టమ్స్ సుంకం 10 శాతానికి పరిమితం



  • Feb 01, 2026 12:27 IST

    చిన్న మదుపరుల ప్రయోజనం కోసం కేంద్రం కీలక నిర్ణయం   

    • కంపెనీల బైబ్యాక్‌ విధానాలకు శరాఘాతం
    • కార్పొరేట్‌ బైబ్యాక్‌ కొనుగోళ్లపై 22శాతం పన్ను
    • నాన్‌ కొర్పొరేట్‌ బైబ్యాక్‌ కొనుగోళ్లపై 30శాతం పన్ను



  • Feb 01, 2026 12:27 IST

    భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు చేసే సంస్థలకు శుభవార్త

    • 2047 వరకూ డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్‌ హాలీడే
    • ట్యాక్స్‌ హాలిడే నిర్ణయంతో క్లౌడ్‌ సేవల సంస్థలకు భారీ ప్రయోజనం



  • Feb 01, 2026 12:26 IST

    నిర్మలా సీతారామన్‌

    విదేశీ యాత్రలపై TCS 2 శాతానికి తగ్గింపు.. తగ్గనున్న విదేశీ ప్రయాణ ఖర్చులు.. పన్ను ఎగవేతదారులకు జైలు శిక్ష నుంచి మినహాయింపు.. ఇకపై పన్ను ఎగవేతదారులకు 30 శాతం పెనాల్టీ:



  • Feb 01, 2026 12:18 IST

    నష్టాల్లో స్టాక్ మార్కెట్

    నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. 300 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్.. 140 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ..



  • Feb 01, 2026 12:15 IST

    ఎల్‌ఆర్‌ఎస్‌ కింద టీడీఎస్‌ 5 నుంచి 2శాతానికి తగ్గింపు

    • గతేడాదితో పోలిస్తే 0.1శాతం తగ్గిన ద్రవ్యలోటు
    • 2026-27లో ద్రవ్యలోటు 4.3శాతానికి తగ్గించాలని లక్ష్యం
    • ఖగోళశాస్త్ర పరిశోధనల అభివృద్ధి, ఆసక్తి పెంచడమే లక్ష్యంగా చర్యలు
    • నేషనల్‌ లార్జ్‌సోలార్‌ టెలిస్కోప్‌, నేషనల్ లార్జ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ టెలిస్కోప్‌ ఏర్పాటు
    • హిమాలయన్‌ చంద్ర టెలిస్కోప్‌, కాస్మోస్‌-2 ప్లానిటోరియం ఏర్పాటు
    • తేరవాద, మహాయాన బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
    • ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు రూ.లక్షా 4వేల కోట్ల నిధులు



  • Feb 01, 2026 12:03 IST

    సెమీ కండక్టర్‌ 2.0 విధానం - నిర్మలా సీతారామన్‌

    • సెమీకండక్టర్‌ ఇండియా మిషన్‌ 2.0 కోసం రూ.40వేల కోట్లు
    • రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ కోసం కేరళ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో ఖనిజాల వెలికితీతకు పథకం
    • దేశంలో కొత్తగా మూడు రసాయన పార్కుల స్థాపన
    • భవన నిర్మాణరంగలో నిర్మాణరంగ పరికరాల అభివృద్ధి
    • ప్రపంచస్థాయి కంటైనర్‌ తయారీ కార్పొరేషన్‌ ఏర్పాటు
    • జాతీయ ఫైబర్‌ విధానం దిశగా అడుగులు వేస్తాం
    • జౌళి రంగ విస్తరణ, ఆధునీకీకరణ, ఉపాధి దిశగా మరిన్ని అడుగులు వేస్తాం: నిర్మలా సీతారామన్‌



  • Feb 01, 2026 12:03 IST

    సీ-స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సాయం

    • కొత్తగా డిడికేటెడ్‌ ఫ్లైట్‌ కారిడార్‌ ఏర్పాటు
    • వారణాసి, పట్నాల్లో షిప్‌ రిపేర్‌ కర్మాగారం ఏర్పాటు



  • Feb 01, 2026 12:02 IST

    ఎన్నారైలకు గుడ్‌ న్యూస్‌

    • విదేశాల్లో ఉంటున్న భారతీయులకు గుడ్‌న్యూస్‌
    • భారత స్టాక్‌ మార్కెట్‌లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపునకు అవకాశం
    • మూలధన వ్యయం రూ.12.2లక్షల కోట్లకు పెంపు
    • 5 లక్షల జనాభా దాటిన నగరాలపై ప్రత్యేక దృష్టి
    • 5 ప్రాంతీయ వైద్య కేంద్రాలు, విద్య, వైద్య పరిశోధనలు సంస్థల ఏర్పాటు



  • Feb 01, 2026 12:02 IST

    దేశంలో మూడు ఆయుర్వేద ఆస్పత్రుల ఏర్పాటు

    • ఆయుష్‌ కేంద్రాల అప్‌గ్రేడేషన్‌
    • సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్‌నగర్‌లో పరిశోధన కేంద్రం ఏర్పాటు
    • ప్రైవేటు రంగంలో పశువైద్య, డయాగ్నస్టిక్స్‌ ఏర్పాటుకు ప్రోత్సాహం
    • యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సుల ఏర్పాటు



  • Feb 01, 2026 12:02 IST

    ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

    • ఆతిథ్యరంగంలో జాతీయ సంస్థ ఏర్పాటు
    • 20 పర్యాటక ప్రాంతాల్లో పదివేల గైడ్‌ల నియామకం
    • సూక్ష్మతరహా పరిశ్రమలకు రూ.2వేల కోట్లు కేటాయింపు
    • స్వయం సమృద్ధ భారతం పేరుతో రూ.2వేల కోట్ల ఫండ్‌ ఏర్పాటు
    • ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా ఎంఎస్‌ఎంఈలకు చేయూత



  • Feb 01, 2026 12:01 IST

    పులికాట్‌లో పక్షులను వీక్షించేందుకు ప్రత్యేక సౌకర్యాలు

    • టైక్స్‌టైల్‌ రంగం కోసం 5 సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమం
    • టైక్స్‌టైల్‌ రంగం కోసం వచ్చే ఐదేళ్లకు రూ.10వేల కోట్లు
    • నేషనల్‌ డిజిటల్‌ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు
    • 15 పురావస్తు ప్రాంతాల అభివృద్ధి
    • ఖేలో ఇండియా మిషన్‌లో భాగంగా క్రీడాభివృద్ధి
    • యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్‌ రంగాలకు చేయూత
    • సంప్రదాయ వైద్యంలో పరిశోధనలపై దృష్టి
    • తూర్పు భారతంలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ డిజైన్‌



  • Feb 01, 2026 12:01 IST

    దేశీయ జల రవాణాలో ఆధునిక విధానాలు

    • మౌలిక సదుపాయాల రంగంలో పనిచేసే కూలీలకు ఉపయోగపడేలా నిధులు
    • జాతీయ జలరవాణా కార్యక్రమంలో భాగంగా తూర్పు-పశ్చిమాల అనుసంధానం
    • వారసత్వం పారిశ్రామిక క్లస్టర్ల పునరుద్ధరణ



  • Feb 01, 2026 12:01 IST

    కొబ్బరి ఉత్పత్తి కోసం కొబ్బరి ప్రోత్సాహకం పథకం

    • 500 రిజర్వాయర్లలో చేపల అభివృద్ధికి చర్యలు
    • పశు సంవర్ధక శాఖలో భారీగా ప్రోత్సహకాలు
    • వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం
    • తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం
    • కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు ప్రోత్సాహకాలు
    • జీడిపప్పు, కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు
    • గంధం చెట్ల వనాలు, బాదం, పైన్‌నట్స్‌ కోసం ప్రత్యేక పథకం



  • Feb 01, 2026 12:00 IST

    దివ్యాంగుల కోసం దివ్యాంజన్‌ కౌశల్‌ యోజన

    • దివ్యాంగులకు చేయూతగా దివ్యాంజన్‌ కౌశల్‌ యోజన, దివ్యాంగ్‌ సహకార యోజన
    • మానసిక వ్యాధుల చికిత్సకు నిమ్స్‌హన్స్‌. రాంచీ, తేజ్‌పుర్‌లలో ఏర్పాటు.
    • తూర్పు ప్రాంతంలోని 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి



  • Feb 01, 2026 12:00 IST

    ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం

    • సరళతరం చేసిన ఫారాలు త్వరలో అందుబాటులోకి
    • సామాన్యులు సైతం ఫైల్‌ చేసేలా  మార్పులు



  • Feb 01, 2026 11:59 IST

    ఖేలో ఇండియా మిషన్

    క్రీడల అభివృద్ధికి ఖేలో ఇండియా మిషన్
    మహిళల కోసం షీ మార్ట్స్ ఏర్పాటు
    ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు
    వచ్చే ఐదేళ్లు టెక్స్‌టైల్ రంగానికి రూ.10వేల కోట్లు
    15 పురావస్తు ప్రాంతాల అభివృద్ధి
    నేషనల్‌ డిజిటల్‌ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు
    గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు రూ.1.40 లక్షల కోట్లు



  • Feb 01, 2026 11:58 IST

    షీ మార్ట్స్‌

    మహిళల ద్వారా ప్రత్యేక ‘షీ మార్ట్స్‌’ బజార్ల ఏర్పాటు.. షీ మార్ట్స్‌ బజార్ల ఏర్పాటుకు ఆర్థిక సాయం అందజేస్తాం: నిర్మలా సీతారామన్‌



  • Feb 01, 2026 11:54 IST

    నిర్మలా సీతారామన్‌

    చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు.. 500 రిజర్వాయర్లలో చేపల పెంపకం, అభివృద్ధికి చర్యలు. పశు సంవర్ధక శాఖలో భారీగా ప్రోత్సాహకాలు.. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం.. తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల నాటకానికి ప్రోత్సాహం.. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం.. కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్ల నాటకానికి ప్రోత్సాహకాలు:



  • Feb 01, 2026 11:54 IST

    ఎన్నారైలకు నిర్మలమ్మ బంపర్ ఆఫర్

    కేంద్ర బడ్జెట్ 2026లో ఎన్నారైలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్ద పీట వేశారు. విదేశాల్లో ఉంటూ భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలనుకునే ఎన్నారైల కోసం ఇన్వెస్ట్‌మెంట్ నిబంధనలను సులభతరం చేయబోతున్నట్లు ప్రకటించారు.

    nirmalamma



  • Feb 01, 2026 11:53 IST

    Earth Corridors : హైదరాబాద్ కు నిర్మలమ్మ అదిరిపోయే గుడ్ న్యూస్

    కేంద్ర బడ్జెట్ 2026లో మోదీ సర్కార్ భారీ నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానిస్తూ ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను (High-Speed Rail Corridors) అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

    hyderabad



  • Feb 01, 2026 11:47 IST

    దేశవ్యాప్తంగా మూడు ఆల్‌ ఇండియా ఆయుర్వేద కాలేజీల ఏర్పాటు

    మెడికల్‌ టూరిజానికి ప్రోత్సాహం.. ప్రైవేట్‌ రంగంతో కలిసి ఐదు రీజినల్‌ మెడికల్‌ హబ్‌ల ఏర్పాటు.. మెడికల్‌ హబ్‌ల ద్వారా ఉద్యోగ కల్పన.. దేశవ్యాప్తంగా మూడు ఆల్‌ ఇండియా ఆయుర్వేద కాలేజీల ఏర్పాటు: నిర్మలా సీతారామన్‌



  • Feb 01, 2026 11:46 IST

    నిర్మలా సీతారామన్

    2014-15లో రూ.2 లక్షల కోట్లు ఉన్న ప్రభుత్వ మూలధన వ్యయాన్ని నేడు రూ.12.2 లక్షల కోట్లకు పెంచుతున్నాం - కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు.



  • Feb 01, 2026 11:44 IST

    లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    250 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్
    120 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ
    లాభాల్లో టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ షేర్లు
    కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్



  • Feb 01, 2026 11:43 IST

    నిర్మలా సీతారామన్

    21వ శతాబ్దం టెక్నాలజీదే.. ఏఐ మిషన్ కు ప్రాధాన్యం.. హై లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఏర్పాటు.. ఏఐతో విద్యార్థులు, రైతులకు ఉపయోగపడే ప్రణాళికలు:



  • Feb 01, 2026 11:42 IST

    గ్రామ స్వరాజ్యం దిశగా అతిపెద్ద అడుగు..

    చేనేత రంగాన్ని, చేనేత కళాకారులను, గ్రామీణ ఆదాయాన్ని బలోపేతం చేసేందుకు మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్‌ను తీసుకొస్తున్నాం.- కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు.



  • Feb 01, 2026 11:41 IST

    నిర్మలా సీతారామన్‌

    నగరాలే దేశ గ్రోత్ ఇంజిన్లు.. రెండో, మూడో స్థాయి నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు.. పాట్నా, వారణాసిల్లో షిప్‌ రిపేర్‌ ఎకోసిస్టమ్‌.. 7 హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల అభివృద్ధి.. ముంబై- పుణే, పుణే-హైదరాబాద్‌, హైదరాబాద్‌- చెన్నై రూట్లలో హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు.. ఢిల్లీ- వారణాసి, వారణాసి- సిలిగురి మార్గాల్లో హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌: 



  • Feb 01, 2026 11:38 IST

    దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

    కేంద్ర బడ్జెట్ 2026-27
    దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి
    1. ముంబై నుంచి పూణె
    2. పూణె నుంచి హైదరాబాద్
    3. హైదరాబాద్ నుంచి బెంగళూరు
    4. బెంగళూరు నుంచి చెన్నై
    దేశంలోని నగరాల మధ్య కనెక్టివిటీ పెంచటం, మెరుగైన రవాణా వసతులు కల్పించటం లక్ష్యంగా అదనపు కారిడార్లు.



  • Feb 01, 2026 11:37 IST

    ట్రంప్ కు నిర్మలమ్మ బిగ్ షాక్!

    అమెరికా మనకు అతిపెద్ద ఎగుమతి భాగస్వామి. అమెరికా భారీగా 50 శాతం పన్నులు విధిస్తుంది కాబట్టి మన ఎగుమతులు దెబ్బతింటాయి. అందుకే మేము ఎగుమతులపై మాత్రమే ఆధారపడటం లేదు.

    nirmala (1)



  • Feb 01, 2026 11:36 IST

    Nirmala Sitharaman : ఏపీకి కేంద్రమంత్రి గుడ్ న్యూస్.. కీలక ప్రాజెక్టులు!

    పవిత్ర మాఘ పౌర్ణమి పర్వదినాన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 7 శాతం వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

    nir



  • Feb 01, 2026 11:36 IST

    Manfacture హబ్​ గా భారత్​

    * మెగా టెక్స్​ టైల్​ పార్క్స్​ ఏర్పాటు చేస్తున్నాం
    * పుణె‌‌– హైదరాబాద్​ మధ్య  హైస్పీడ్​ రైల్వే కారిడార్​ నిర్మాణం
    * హైదరాబాద్​–బెంగళూర్​ మధ్య హైస్పీడ్​ రైల్వే కారిడార్​ నిర్మాణం



  • Feb 01, 2026 11:35 IST

    కేంద్ర బడ్జెట్ 2026-27

    * దేశంలో 20 కొత్త జల మార్గాలు
    * రాబోయే 5 ఏళ్లల్లో ఈ జల మార్గాలు ప్రారంభం అయ్యే విధంగా రూట్ మ్యాప్
    * జల మార్గాల్లో రవాణా కోసం యువతకు శిక్షణ సంస్థలు ఏర్పాటు
    * ఈ 20 జల మార్గాల ద్వారా దేశంలో వస్తు రవాణా పెంచటం



  • Feb 01, 2026 11:35 IST

    నిర్మలా సీతారామన్‌

    ఆర్థిక సుస్థిరత కోసం ఆరు రంగాల్లో కీలక సంస్కరణలు.. రెండు హైటెక్‌ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు.. MSMEలకు క్రెడిట్‌ గ్యారెంటీ స్కీమ్‌.. విలువైన ఖనిజాల తవ్వకాల కోసం కొత్త స్కీమ్‌.. కేరళ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో రేర్‌ ఎర్త్‌ కారిడార్‌.. SME గ్రోత్‌ ఫండ్‌కు రూ. 10 వేల కోట్లు.. కార్గో అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ.. వచ్చే ఐదేళ్లలో కొత్తగా 20 జలమార్గాలు.. ఒడిశాలో నేషనల్‌ వాటర్‌వే కారిడార్‌.. కొత్తగా కోస్టల్‌ కార్గో ప్రమోషన్‌ స్కీమ్‌:



  • Feb 01, 2026 11:34 IST

    ఉపాధి కల్పనకు సమగ్ర సంస్కరణలను తీసుకొచ్చాం

    ఉపాధి కల్పనకు సమగ్ర సంస్కరణలను తీసుకొచ్చాం.. నేషనల్‌ సెమీకండక్టర్‌ మిషన్‌ను ఏర్పాటు చేశాం.. సెమీ కండక్టర్‌ మిషన్‌ 2.0 కోసం రూ. 40 వేల కోట్లు కేటాయింపు.. ఖాదీ రంగం కోసం మహాత్మాగాంధీ స్వరాజ్‌ స్కీమ్‌.. ఫార్మా రంగానికి రూ. 10 వేల కోట్లు.. టెక్స్టైల్‌ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం.. మెగా టెక్స్‌టైల్స్‌ పార్కుల ఏర్పాటు.. దేశంలో కొత్తగా మూడు NIPERల ఏర్పాటు.. ప్రస్తుతం ఉన్న NIPERల ఆధునికీకరణకు చర్యలు: నిర్మలా సీతారామన్‌



  • Feb 01, 2026 11:29 IST

    కర్తవ్య గ్రోత్ కింద 7 రంగాల్లో శక్తివంతమైన ప్రోత్సహకాలు

    1. ఉపాధి, ఉద్యోగాలు సృష్టించటం
    2. చిన్న, మధ్య తరహాల పరిశ్రమల్లో ఛాంపియన్ MSMEలను సృష్టించటం
    3. పరిశ్రమల్లో 350 సంస్కరణలు అమలు చేయటం
    4. పరిశ్రమల్లో ఉత్పత్తి పెంచే విధంగా తయారీ రంగాలను శక్తివంతంగా మార్చటం
    5. మౌళిక సదుపాయల కల్పనను యుద్ధ ప్రాతిపదికన కల్పించటం
    6. ఏడు వ్యూహాత్మక రంగాల్లోను శక్తివంతంగా తయారు చేయటం లక్ష్యంగా బడ్జెట్ ప్రోత్సహకాలు



  • Feb 01, 2026 11:28 IST

    కేంద్ర బడ్జెట్ 2026 27

    ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా మైనింగ్ కారిడార్
    అరుదైన ఖనిజాల గుర్తింపు, వెలికితీత
    ఆయా రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలని కోరిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్



  • Feb 01, 2026 11:27 IST

    లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ 2026-27

    బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు
    ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళలో గనుల కారిడార్
    మూడు డెడికేటెడ్ కెమికల్ పార్క్‌ల నిర్మాణం
    ప్రస్తుతమున్న NIPERs ఆధునీకరణ
    దేశంలో 2 హైటెక్ టెక్నాలజీ రూమ్స్‌ ఏర్పాటు
    కంటైనర్ నిర్మాణ రంగానికి రూ.10 వేల కోట్లు
    దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు
    సెమీకండక్టర్ మిషన్ కోసం రూ.40 వేల కోట్లు
    జౌళి రంగానికి కేంద్ర బడ్జెట్‌లో చేయూత
    మెగా టెక్స్‌టైల్ పార్క్‌ నిర్మాణం
    సెమీ కండక్టర్ మిషన్ 2.O ప్రారంభం
    త్వరలో నేషనల్ ఫైబర్ స్కీమ్ ప్రారంభం
    టెక్స్‌టైల్‌ రంగం అభివృద్ధికి కొత్త పథకం
    దేశంలో కొత్త మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు
    ఖాదీ, హ్యాండ్లూమ్‌, హస్తకళల ప్రోత్సాహానికి పథకం
    అత్యంత నాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీకి పథకం
    200 పారిశ్రామిక క్లస్టర్స్‌ ఆధునీకరణకు చేయూత
    ఆత్మనిర్భర్‌ భారత్‌కు రూ.2 వేల కోట్లు
    SME రంగానికి రూ.10 వేల కోట్లు
    మైక్రో సెక్టార్‌కు రూ.2 వేల కోట్లు
    ఆత్మనిర్భర్‌ భారత్‌కు రూ.2 వేల కోట్లు



  • Feb 01, 2026 11:12 IST

    వికసిత్ భారత్ బడ్జెట్‌

    కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్న వికసిత్ భారత్ బడ్జెట్‌కి రాష్ట్రపతి ముర్ము గారు ఆశీర్వదం అందించి, నోరు తీపి చేశారు.



  • Feb 01, 2026 11:11 IST

    Union Budget 2026-27

    పవిత్ర మాఘ పౌర్ణమి రోజున బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నాం.. 7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నాం.. వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం.. గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాం: నిర్మలా సీతారామన్



  • Feb 01, 2026 11:10 IST

    కేంద్ర బడ్జెట్ 2026-27

    * యువ శక్తి బడ్జెట్ గా రూపకల్పన
    * కొత్త ఆలోచనలు, స్టార్టప్ లకు ప్రాధాన్యం
    * ఉద్యోగ కల్పన కోసం యువతకు ప్రోత్సహం దిశగా బడ్జెట్



Advertisment
తాజా కథనాలు