బర్డ్ ఫ్లూ వైరస్‌తో ప్రజలు భయాందోలనలో ఉన్నారు. వారికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చికెన్ మేళాలు ప్రారంభమయ్యాయి. తాజాగా హైదరాబాద్ ఉప్పల్‌లో ఈ మేళా ఏర్పాటు చేశారు. అందులో ఫ్రీగా చికెన్, ఎగ్ ఐటెమ్స్ పంపిణీ చేశారు. ఇలా 6 చోట్ల మేళాలను నిర్వహించారు.
Free Chicken and Egg Mela Draws Massive Crowds in Hyderabad Amid Bird Flu Fears Photograph: (Free Chicken and Egg Mela Draws Massive Crowds in Hyderabad Amid Bird Flu Fears)
Feb 22, 2025 13:04 IST
లిప్ట్ లో ఇరుక్కుపోయిన బాలుడు మృతి!
లిప్ట్ లో ఇరుక్కుపోయి నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న బాలుడు అర్నవ్(6) మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, జూపల్లి ఉత్తమ్ హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.
Feb 22, 2025 10:11 IST
కుంభమేళాలో డిజిటల్ స్నానం... కేవలం 1100 లే.. అదిరిపోయింది కదా ఐడియా!
మహా కుంభమేళాను వ్యాపార కేంద్రంగా చేసుకొని చాలా మంది ఉపాధి పొందుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించి..పుణ్యస్నానాలను.. డిజిటల్ స్నానాలుగా మార్చేశాడు. కేవలం 1100 చెల్లిస్తే ఈ స్నానాలను చేయిస్తానని అంటున్నాడు.
digital bath
Feb 22, 2025 08:18 IST
లక్ష కోట్లు పోగొట్టుకున్న అదానీ..అధిక సంపద కోల్పోయిన వారిలో సెకండ్
2025 మొదలయ్యాక రెండు నెలల్లోనే ప్రపంచ కుబేరులు కుదేలవుతున్నారు. స్టాక్ మార్కెట్లు పడిపోతుండడంతో భారత బిలియనీర్ గౌతమ్ అదానీ ఇప్పటివరకు దాదాపు 1 లక్షా 25 వేల కోట్లను నష్టపోయారు. అత్యంత ఎక్కువ సంపద కోల్పోయిన వారిలో అదానీ రెండవ స్థానంలో ఉన్నారు.
Feb 22, 2025 08:04 IST
విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త...ఇకపై ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు
హైదరాబాద్ జేఎన్టీయూ ఇక నుంచి ప్రతి నెలా నాలుగో శనివారం కూడా విద్యార్థులకు సెలవు ఇవ్వాలని నిర్ణయించుకుంది.నాలుగో శనివారం సెలవు.. ఈరోజు నుంచే అమలు కానుంది.విద్యార్థులతో పాటు ఆచార్యులు, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బందికి కూడా హాలిడేనే.
holidays
Feb 22, 2025 08:03 IST
కోహ్లీని భయపెడుతున్న పాక్ స్పిన్నర్
కోహ్లీ గత 5 ఇన్నింగ్స్‌లలో లెగ్ స్పిన్నర్లకే వికెట్ సమర్పించుకున్నాడు. పాకిస్తాన్ జట్టులో అబ్రార్ అహ్మద్ రూపంలో ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాక్ తో జరగబోయే మ్యాచ్ లో ఇతడి బౌలింగ్ లో కోహ్లీ ఎలా ఆడుతాడన్నది చూడాలి.
Feb 22, 2025 08:02 IST
హెడ్‌లైన్‌గా మారిన ఛావా.. మూవీపై పీఎం ప్రశంసలు
మరాఠా పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఇటీవల విడుదలైన ఛావా సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయితే ప్రధాని మోదీ ఈ సినిమాపై ప్రశంసంలు కురిపించారు. ఛావా సినిమా ప్రస్తుతం హెడ్‌లైన్‌గా మారిందన్నారు.
Modi compliment to Chhaava Photograph: (Modi compliment to Chhaava)
Feb 22, 2025 08:02 IST
అదరగొట్టిన సౌత్ ఆఫ్రికా...తేలిపోయిన ఆఫ్ఘాన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మూడవ మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య జరిగింది. ఇందులో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో ఆఫ్ఘాన్ చిత్తుగా ఓడిపోయింది.
South Africa Won The Match
Feb 22, 2025 08:01 IST
చనిపోయారు.. ఎలా విచారించాలి.. రాజలింగమూర్తి పిటిషన్ పై హైకోర్టు
మేడిగడ్డ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావులను విచారించాలని రాజలింగమూర్తి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు...అతను చనిపోవడం వలన ఆ పిటిషన్ కు అర్హత లేదని అంది.
Telangana High Court
Feb 22, 2025 07:59 IST
ఇంటర్ విద్యార్థులకు బిగ్ షాక్.. సెలవులు కుదింపు
ఏపీ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచే నుంచే సెకండియర్ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ తో పోటీ పరీక్షలకు సంబంధించి 22వ తేదీ వరకు క్లాసులు నిర్వహించనుంది.