🔴 LIVE NEWS: రూ. 850 కోట్ల పోంజీ స్కామ్ కేసులో ఇద్దరు అరెస్ట్

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Feb 17, 2025 12:32 IST

    కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన బండి.. ఏమని విష్ చేశాడో తెలుసా..!?

    బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.

    Bandi Sanjay KCR
    Bandi Sanjay KCR

     



  • Feb 17, 2025 11:40 IST

    రూ. 850 కోట్ల పోంజీ స్కామ్ కేసులో ఇద్దరు అరెస్ట్

    దేశవ్యాప్తంగా 6వేలమందికి పైగా డిపాజిటర్లను మోసం చేసిన ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్‌ఫామ్‌తో కూడిన రూ. 850 కోట్ల పోంజీ స్కీమ్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. 

    ponzi scam



  • Feb 17, 2025 11:10 IST

    బాబోయ్ భూకంపం.. ఢిల్లీతో పాటు బీహార్‌లో కూడా: ఇళ్లలోంచి పరుగే పరుగు!

    దేశ రాజధాని ఢిల్లీతో పాటు బీహార్ రాష్ట్రంలోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 4.0 తీవ్రతతో బీహార్ లోని శివాన్‌లో భూకంపం సంభవించింది. దీని కారణంగా పలు ప్రాంతాల్లోని అనేక ఎత్తైన భవనాల నివాసితులు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 

    Bihar Siwan Earthquake
    Bihar Siwan Earthquake Photograph: (Bihar Siwan Earthquake)

     



  • Feb 17, 2025 09:55 IST

    కేసీఆర్ కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్.. ఏం అన్నారంటే!

    బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

    kcr vs revanth wishes



  • Feb 17, 2025 09:11 IST

    తెలంగాణ ఖచ్చితంగా వస్తుందని కేసీఆర్ ఎలా నమ్మారంటే... ఈ మూడే కారణం!

    2001వ సంవత్సరం నవంబర్ నెలలోఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు కేసీఆర్ కు నమ్మకాన్ని కలిగించాయి. పోరాడితే తెలంగాణ ఏర్పాటు అసాధ్యమేమీ కాదని కేసీఆర్ బలంగా నమ్మారు. అలా 13 ఏళ్ల పోరాటం ఉద్యమం చేసి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

    HBD KCR
    HBD KCR

     



  • Feb 17, 2025 08:08 IST

    కేసీఆర్ పుట్టిన రోజు.. హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్!

    తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ 71వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్ చేశారు.

    kcr, harish rao



  • Feb 17, 2025 07:57 IST

    ఢిల్లీ భూకంపం .. ప్రజలకు మోదీ కీలక సూచనలు!

    ఢిల్లీ భూ ప్రకంపనలపై స్పందించారు పీఎం మోదీ.  ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

    modi tweet



  • Feb 17, 2025 07:56 IST

    దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం

    దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 17వ తేదీన స్వల్ప భూప్రంకపనలు వచ్చాయి.  భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఎక్స్ వేదికగా  తెలిపింది. ప్రకంపనలు ఉదయం 5:36 గంటలకు సంభవించాయని వెల్లడించింది.

    bookampam



  • Feb 17, 2025 07:38 IST

    అయ్యో ఘోరం: కూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు మృతి!

    ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కూలి పనుల కోసం గుంటూరు వెళ్తున్న మహిళల ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. నారా కోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య ఈ ప్రమాదం సంభవించింది.



  • Feb 17, 2025 07:37 IST

    తిరుమలలో ఆ ఐదు రోజులు ఆర్జిత సేవలు రద్దు.. !



  • Feb 17, 2025 07:36 IST

    మరో తొమ్మిదే రోజులే ఉన్నా..ఏ మాత్రం తగ్గని జనం...రైల్వేశాఖ అలర్ట్‌!



  • Feb 17, 2025 07:36 IST

    మారిషస్‌ మాజీ ప్రధాని ప్రవింద్‌ అరెస్ట్‌!



Advertisment
Advertisment
Advertisment