🔴 LIVE NEWS: గద్దర్‌ను అలా చేసినందుకే KCR గడీలు బద్దలైయ్యాయ్ : సీఎం రేవంత్ రెడ్డి

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Feb 01, 2025 10:18 IST

    రూ.10 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు అంటూ ప్రచారం



  • Feb 01, 2025 10:16 IST

    8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ



  • Feb 01, 2025 10:15 IST

    ఆదాయపన్ను విషయంలో విప్లవాత్మక మార్పులు ఉంటాయని ఊహాగానాలు



  • Feb 01, 2025 10:15 IST

    కేంద్ర బడ్జెట్‌పై దేశ ప్రజల్లో ఆసక్తి



  • Jan 31, 2025 21:39 IST

    Crime News: సికింద్రాబాద్‌లో తల్లి శవంతో 8రోజులు.. ఇంట్లో గడిపిన ఇద్దరు కూతుళ్లు

    సికింద్రాబాద్ ఓ మహిళ చావు మిస్టరీగా మారింది. లలిత చనిపోయిన 8 రోజులు అవుతున్నా ఆమె ఇద్దరు కూతుళ్లు మృతదేహం ఇంట్లోనే ఉంచి బయటకు తెలియనివ్వలేదు. శుక్రవారం వాళ్లే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Secundrabad Varasiguda Crime News
    Secundrabad Varasiguda Crime News Photograph: (Secundrabad Varasiguda Crime News)

     



  • Jan 31, 2025 15:27 IST

    BREAKING: నేను కొడితే మాములుగా ఉండదు.. కాస్కో రేవంత్ : KCR

    తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని ఆయన మండిపడ్డారు. నేను కొడితె మామూలుగా ఉండదని కేసీఆర్ రేవంత్ సర్కార్‌కు మాస్ మార్నింగ్ ఇచ్చారు.

    kcr warning
    kcr warning

     



  • Jan 31, 2025 14:21 IST

    జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద హైటెన్షన్

    హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం శుక్రవారం మరోసారి హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. గురువారం అరెస్ట్‌ అయిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఒక్కసారిగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందుకు దూసుకువచ్చారు.దీంతో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది.కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

    BRS Corporators
    BRS Corporators

     



  • Jan 31, 2025 14:05 IST

    టాస్క్‌ఫోర్స్‌ అధికారినని బిల్డప్‌ ఇచ్చి... చివరికి

    టాస్క్‌ఫోర్స్‌ అధికారినంటూ పలువురి బెదిరించి డబ్బులు వసూలు చేస్తు్న్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా రేపల్లె చోడాయిపాలెం గ్రామానికి చెందిన చిక్కాల సుమన్ 2006 నుంచి హోంగార్డుగా పనిచేస్తున్నాడు.

    Fake task force officer
    Fake task force officer

     



  • Jan 31, 2025 11:45 IST

    ఉస్మానియా ఆసుపత్రికి నేడు భూమి పూజ

    తెలంగాణ వైద్యారోగ్య చ‌రిత్రలో మ‌రో కొత్త మైలురాయికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుట్దింది. నిజాం కాలంలో నిర్మితమై వందలేండ్లుగా తెలంగాణతో పాటు పరిసర రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి నేడు భూమి పూజ నిర్వహించనున్నారు.

     Osmania General Hospital
    Osmania General Hospital

     



  • Jan 31, 2025 11:44 IST

    ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్

    వచ్చే నెలలో పాకిస్తాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్ తగిలింది.  స్టార్‌ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ వెన్నునొప్పి కారణంగా ట్రోఫీ నుండి వైదొలిగాడు.  ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.

    Mitchell Marsh
    Mitchell Marsh Photograph: (Mitchell Marsh)

     



  • Jan 31, 2025 10:04 IST

    కన్నతల్లిని కడతేర్చిన తనయుడు

    విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఆన్ లైన్ గేములకు బానిసైన కొడుకును మందలించడమే ఆ తల్లి చేసిన పాపమైంది. కొడుకును మార్చడానికిఆ తల్లి చేసిన ప్రయత్నం ఫలించకపోగా కొడుకు చేతిలో ప్రాణాలు పోయాయి. కొడుకు చేతిలో హత్యకు గురైంది.

    son kills mother
    son kills mother

     



  • Jan 31, 2025 09:37 IST

    తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య

    తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు.

     



  • Jan 31, 2025 09:33 IST

    గద్దర్ విషయంలో ఇప్పటికీ అది మిస్టరీగానే .. ఇంతకీ వాళ్లు ఎవరు?

    1997 ఏప్రిల్‌ 6న గుర్తుతెలియని వ్యక్తులు గద్దర్ నివాసంపై దాడి చేసి, ఆయనపై కాల్పులు జరిపారు.  దాడి చేసిన వ్యక్తులెవరో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దాడి సమయంలో గ్రీన్ టైగర్స్ అనే పేరుతో ఓ లేఖను  విడుదల చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పురోగతి లభించలేదు.  

    gaddar jayanthi
    gaddar jayanthi Photograph: (gaddar jayanthi)

     



  • Jan 31, 2025 08:31 IST

    తెలంగాణలో షాకింగ్ కొత్త వైరస్.. సిద్దిపేటలో తొలి కేసు!

    మహారాష్ట్రలో విజృంభిస్తున్న గిలియన్‌ బార్‌ సిండ్రోమ్‌ తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ మహిళలో ఈ సిండ్రోమ్‌ లక్షణాలు బయటపడ్డాయి. మహిళ హైదరాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    gbs
    gbs

     



  • Jan 31, 2025 08:31 IST

    పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాకు పారిపోయాడు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

    కోర్టు ధిక్కరణ కేసు ఎదురుకుంటున్న ఓ నిందితుడు తన పాస్‌పోర్ట్ కోర్టు కస్టడీలో ఉన్నప్పటికీ అమెరికాకు ఎలా పారిపోయాడనే దానిపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. అతను ఎలా దేశాన్ని వదిలిపెట్టి వెళ్లాడని ప్రశ్నించింది. దీనిపై దర్యాప్తు జరపాలని హోంశాఖను ఆదేశించింది.  

    supreme court of india
    supreme court of india Photograph: (supreme court of india)

     



  • Jan 31, 2025 08:30 IST

    కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం

    మహాకుంభ మేళాలో టీటీడీ ఉద్యోగి ఒకరు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసి, విధి నిర్వహణకు 200 మంది ఉద్యోగులు, సిబ్బందిని పంపించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒకరు కనిపించకుండా పోయారు.

    TTD TEMPLE IN KUMBH MELA
    TTD TEMPLE IN KUMBH MELA

     



  • Jan 31, 2025 08:29 IST

    అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు



  • Jan 31, 2025 08:29 IST

    కేరళ లిక్కర్ స్కామ్ .. ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్

    ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఆరోపణలు ఎదురుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది.  ఢిల్లీ తరహాలోనే కేరళలో కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని..ఇందులో కూడా కవిత కీలక పాత్ర పోషించారంటూ  కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆరోపించారు.

    BRS leader Kavitha
    BRS leader Kavitha Photograph: (BRS leader Kavitha)

     



  • Jan 31, 2025 08:29 IST

    నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు



  • Jan 31, 2025 08:26 IST

    హత్య కేసు నిందితుడ్ని పట్టించిన బూందీ లడ్డూ!



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు