🔴 LIVE NEWS: విజయసాయిరెడ్డి మరో సంచలన ట్వీట్!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Jan 27, 2025 12:58 IST

    విజయసాయిరెడ్డి మరో సంచలన ట్వీట్!

    పుణేలో గిల్లియన్-బ్యారే సిండ్రోమ్ కేసులు 100కిపైగా రావడం అత్యంత ఆందోళనకరమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ వ్యాధి అనూహ్యంగా పెరగడానికి గల కారణాలను లోతుగా పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు. పాలిటిక్స్ కు దూరమంటూ ఇటీవల ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.

    Vijayasai Reddy tweet
    Vijayasai Reddy tweet

     



  • Jan 27, 2025 12:54 IST

    ఫ్రీ బస్సులకు బ్రేక్ .... ఆర్టీసీలో సమ్మె సైరన్

    తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళల ఫ్రీ బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడమే దీనికి కారణం. దీర్ఘకాలంగా ఆర్టీసీలో పేరుకుపోయిన, సమస్యలు, కార్మికుల హక్కుల సాధనకోసం సమ్మెబాట పట్టనున్నారు.

    TGRTC FREE BUS
    TGRTC FREE BUS

     



  • Jan 27, 2025 10:57 IST

    సూర్యాపేటలో పరువు హత్య.. ప్రేమించాడని వెంటపడి.. రాళ్లతో కొట్టి..!

    సూర్యాపేట జిల్లా మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణను బండ రాళ్లతో కొట్టి హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రేమవివాహమే ఈ హత్యకు దారి తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    Read More : https://rtvlive.com/crime/suryapet-tragedy-incident-a-man-brutally-killed-telugu-news-8656893



  • Jan 27, 2025 09:25 IST

    ఉత్తరాఖండ్‌ లో ఉమ్మడి పౌరస్మృతి.. ఎప్పటి నుంచి అమలు అంటే

    బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌ లో సోమవారం నుంచి ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఆదివారం ప్రకటించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ అవతరిస్తుందన్నారు.

    ucc
    ucc

     



  • Jan 27, 2025 09:24 IST

    ఫిబ్రవరి 5 వరకు అక్కడ పాఠశాలలు బంద్

    ఉత్తరప్రదేశ్ మహా కుంభమేళాకు వెళ్తున్న భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో కొందరు భక్తులు వారణాసి కూడా వెళ్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీంతో వారణాసి మేజిస్ట్రేట్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేటి నుంచి ఫిబ్రవరి 5 వరకు సెలవులు ప్రకటించింది.

    Schools: ఆ రాష్ట్రంలో 1600 స్కూళ్ల మూసివేత‌..



  • Jan 27, 2025 09:23 IST

    హైదరాబాద్‌లో గంజాయి పట్టివేత

    హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో విదేశీ గంజాయిని విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకొచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 170 గ్రాముల విదేశీ గంజాయిని సీజ్ చేశారు

    Hyderabad : అమెజాన్ పార్సిల్‌లో గంజాయి కలకలం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్



  • Jan 27, 2025 09:22 IST

    ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు.. బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

    గాజాలో ఇజ్రాయెల్ విధ్వంస తీవ్రతను తగ్గించేందుకు గతంలో బైడెన్‌ సర్కారు తీసుకొన్న నిర్ణయాన్ని తాజాగా డొనాల్డ్ ట్రంప్ పక్కనబెట్టారు. ఇజ్రాయెల్‌కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను సరఫరా చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోదం తెలిపారు.

    America President Trump
    America President Trump

     



  • Jan 27, 2025 09:20 IST

    గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు హై రిస్క్‌ వార్నింగ్‌..!

    సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ ను ఈరోజుల్లో వాడని వారు ఉండరు. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, విండోస్ లలో గూగుల్ క్రోమ్ ను యూజ్ తెగ వాడేస్తుంటారు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ గూగుల్ క్రోమ్ యూజర్లకు ఓ పెద్ద అలర్ట్ ఇచ్చింది. ఆ అలర్ట్‌ ఏంటో ఈ కథనంలో..

    Google Chrome: క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక!



  • Jan 27, 2025 09:18 IST

    ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

    కేరళ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఓ పులిని మ్యాన్​ ఈటర్​గా ప్రకటించి సంచలనం సృష్టించింది. అది కనపడితే కాల్చేయమని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..

    Read More : https://rtvlive.com/national/kerala-govt-declares-wayanad-tiger-a-man-eater-after-fatal-attack-on-woman-orders-killing-8656535



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు