🔴 LIVE BREAKINGS: సివిల్స్‌ దరఖాస్తులకు గడువు పెంపు

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Feb 18, 2025 21:28 IST

    UPSC CSE 2025: సివిల్స్‌ దరఖాస్తులకు గడువు పెంపు

    అఖిల భారత సర్వీసుల్లో 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) పరీక్షకు జనవరిలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష గడువు ఫిబ్రవరి 18తో ముగియగా.. తాజాగా యూపీఎస్సీ ఫిబ్రవరి21 వరకు గడువు పెంచింది.

    UPSC
    UPSC

     



  • Feb 18, 2025 18:13 IST

    Health Ministry: కేంద్రం సంచలన ప్రకటన.. బీపీ, షుగర్, క్యాన్సర్‌ టెస్టులు ఫ్రీ

    కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. అధిక రక్తపోటు (High BP), డయాబెటీస్, క్యాన్సర్ వంటి వ్యాధులపై దేశవ్యాప్తంగా ఉచితంగా పరీక్షలు జరుపుతామని వెల్లడించింది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 31 వరకు వీటిపై స్క్రీనింగ్ డ్రైవ్‌ నిర్వహించనున్నామని పేర్కొంది.

    Health Ministry to launch nationwide screening drive for high BP, diabetes, cancer
    Health Ministry to launch nationwide screening drive for high BP, diabetes, cancer

     



  • Feb 18, 2025 12:16 IST

    యూనస్ ఒక ఉగ్రవాది.. మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ  ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బంగ్లాకు తిరిగి వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని అన్నారు. 

    Sheik Hasina:షేక్‌ హసీనాపై 53కు చేరిన కేసులు..



  • Feb 18, 2025 12:14 IST

    ముగ్గురు భార్యలు, 12 మంది పిల్లలు.. ఎలన్ మస్క్‌పై ట్రాన్స్‌జెండర్ కూతురు షాకింగ్ కామెంట్స్

    తన బిడ్డకు ఎలన్ మస్క్ తండ్రని ఆష్లే క్లైర్ Xలో ప్రకటించగా.. కొత్త తోబుట్టువు గురించి తెలిసిన ప్రతీసారి తన దగ్గర డబ్బులుంటున్నాయని మస్క్ ట్రాన్స్‌జెండర్ కూతురు వివియన్ విల్సన్ పేర్కొంది. ఎంతమంది తమ్ముళ్లు, చెల్లెలు ఉన్నారో తనకే తెలియదని ఆమె పోస్ట్ చేసింది.

    Vivian Jenna Wilson
    Vivian Jenna Wilson Photograph: (Vivian Jenna Wilson)

     



  • Feb 18, 2025 10:51 IST

    తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ..హైటెన్షన్

    కాకినాడ జిల్లాలో  హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.  అక్కడి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.  వైస్ ఛైర్మన్ పదవి కోసం టీడీపీ, వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ ఎన్నిక ఇప్పటికి మూడుసార్లు వాయిదా పడింది.

    tension
    High Tension At Tuni

     



  • Feb 18, 2025 09:37 IST

    ఇండియాలో రిచెస్ట్ పార్టీగా బీజేపీ.. 75% కమలం ఖాతాలోకే

    2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆరు జాతీయ పార్టీలకు వివిధ మార్గాల ద్వారా రూ. 5 వేల 820 కోట్ల ఆదాయం సమకూరిందని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)  వెల్లడించింది. ఇందులో 74.56 శాతం అత్యధిక వాటా (రూ.4,340.47 కోట్లు) బీజేపీకి చేరిందని  తెలిపింది.

    bjp adr report



  • Feb 18, 2025 09:36 IST

    నీరు లేక అల్లాడుతున్నపాక్.. 700 అడుగులు తవ్విన చుక్క నీరు లేదు!

    పాక్ తీవ్ర నీటి కొరతతో అల్లాడిపోతుంది.700 అడుగులు తవ్వినా నీళ్లు కనిపించకపోవడంతో.. పాక్‌వాసుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.100 అడుగులు ఉన్న నీరు..ఇప్పుడు 700 అడుగులకు చేరుకుంది.

    pak
    pak

     



  • Feb 18, 2025 09:35 IST

    ప్రార్థనా స్థలాలపై ఎన్నాళ్ళు...ఇక చాలు అన్న సుప్రీంకోర్టు

    ప్రార్థనా స్థలాల విషయంలో ఇంకెన్నాళ్ళు పిటిషన్లు వేస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. దీనిపై కేంద్రం కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరింది. ఇలాంటి పిటిషన్లకు ముగింపు ఉండాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు.



  • Feb 18, 2025 09:35 IST

    కెనడాలో బోల్తాపడ్డ విమానం..18మందికి తీవ్రగాయాలు

    ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగానే అవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట విమానాలు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. తాజాగా కెనడాలోని టొరంటో పియర్‌సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. 



  • Feb 18, 2025 09:34 IST

    అనాధాశ్రమంలో భారీ అగ్నిప్రమాదం.. 140 మంది విద్యార్థులు..

    కృష్ణాజిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాధాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో విద్యార్థులు పరుగులు పెట్టారు. ఆరుగురు విద్యార్థులు లోపలే ఉండిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆశ్రమంలో మొత్తం 140 మంది ఉన్నారు.



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు