Kolakata: పైలట్ కళ్ళల్లో లేజర్ లైట్..170మంది ప్రాణాలు గాల్లో.. గాల్లో విమానం ఉంది...మరికొద్ది సేపటిలో పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేయాలి. కానీ ఇంతలోనే అతని కళ్ళల్లో లేజర్ లైట్ పడింది. కాసేపు అతనికి కళ్ళు కనిపించలేదు. మరి పైలట్ సురక్షితంగా ఫ్లైట్ ల్యాండ్ చేశాడా లేదా...తెలియాలంటే కింద చదవండి... By Manogna alamuru 25 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Bengaluru to kolkata Flight: బెంగళూరు నుంచి కొలకత్తా వస్తున్న విమానం 6E 223 పెద్ద ప్రమాదం తప్పించుకుంది. ఇందులో ఉన్న ఆరుగురు సిబ్బంది, 165మంది ప్రయాణికులు చివరి నిమిషంలో ప్రాణాలతో బయటపడ్డారు. అసలేం జరిగిందంటే...బెంగళూరు నుంచి కోలకత్తా వరకు విమానం బాగానే వచ్చేసింది. ఫ్లైట్‌్లో ఎలాంటి లోపం లేదు. కానీ విమానం మరి కాసేపట్లో పైలట్ ల్యాండ్ చేస్తాడు అనగా అతని కళ్ళల్లో లేజర్ లైట్ పడింది. దీంతో అతని కళ్ళు కొంతసేపు పాటూ మసకబారాయి. దీంతో పైలట్‌కు ఏమీ కనిపించలేదు. కానీ ఎలాగోలా మ్యానేజ్ చేసిన పైలట్ విమానాన్ని మాత్రం సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. కానీ లేజర్ కాంతి కారణంగా పైలట్ చూపు కోల్పోయే అవకాశం అయితే మాత్రం ఉంది. Also Read:Mallu Nandini: ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా మల్లు నందిని! ఈ సంఘటన మీద ఇండిగో విమానయాన సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీని గురించి వెంటనే బిధాన్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇలాంటి చర్యలు విమాన భద్రతకు ప్రమాదకరమని, దీనికి కారణమైన వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇండిగో డిమాండ్ చేస్తోంది. ఈ సంఘటన మీద కోలకత్తా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాస్తవానికి కిందటి వారమే ఫ్లైట్ యాక్సిడెంట్లు, లేజర్ లైట్ సమస్యల మీద ఎయిర్ పోర్ట్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ల్యాండింగ్ టైమ్‌లో లేజర్ కిరణాల వలన పైలట్‌లు కంటి చూపు కోల్పోకుండా ఉండేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పివిల్ ఏవియేషన్ చర్యలు చేపట్టింది. పైలట్లు విమానాన్ని ల్యాండ్ చేస్తున్నప్పుడు లేజర్ లైట్లను ప్రయోగించడం నివారించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ పోర్ట్ చుట్టూ 18.5 కి.మీ ప్రదేశాన్ని నిషూధిత జోన్‌గా ప్రకటించింది కూడా. #flight #indigo #landing #pilot #laser-light మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి