China: చైనాలో బీభత్సం సృష్టించిన కొండచరియలు.. శిథిలాల కింద 47 మంది.. చైనాలో కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. యునాన్ ప్రావిన్స్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో ఏకంగా 47 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరో ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని బయటకు తెచ్చేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. By B Aravind 22 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి చైనాలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు పడి బీభత్సం సృష్టించాయి. యునాన్ ప్రావిన్స్‌లో సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 47 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరో ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని రంగంలోకి దిగింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. Also Read: అమ్మో అంతమందా? భారతీయుల్లో అమెరికా మోజు తగ్గడం లేదుగా! ఇప్పటికే 200 మందిని సంఖ్యలో ఉన్న స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ దుర్ఘటనలు కొన్ని ఇళ్లు కుప్పకూలిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో వాటి కిందే అక్కడివారు చిక్కుకుపోయారు. ఇదిలా ఉండగా.. గత వారం కూడా నార్త్‌వెస్ట్ చైనాలోని ఓ గ్రామీణ ప్రాంతంలో పలు హిమపాతాలు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో వెయ్యికి పైగా స్థానికులు, టూరిస్టులు చిక్కుకుపోయారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందం స్థానికులు, టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. Also Read: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రామమందిరం..ఎక్కడో తెలుసా.. #telugu-news #china #landslides మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి