AP Politics : రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం చేసిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్ళీ రీఎంట్రీ అన్న వార్తలు హల్ చల్ చేస్తోంది. గల్లా జయదేవ్ పాలిటిక్స్‌కు గుడ్ బై చెబుతున్న నేపథ్యంలో లగడపాటి రావడం కాయం అని అని చెబుతున్నారు. By Manogna alamuru 15 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Political Re-Entry : లగడపాటి రాజగోపాల్(Lagadapati Rajagopal).. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు. విజయవాడ ఎంపీగా, ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికలు, 2019లో జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాని కూడా ప్రకటించారు. అప్పడప్పుడు ఏదైనా ప్రైవేట్ కార్యక్రమాల్లో మాత్రం కనిపిస్తున్నారు.. రాజకీయపరమైన అంశాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా లగడపాటి పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. Also Read:టీడీపీకి షాక్…పాలిటిక్స్ కు గల్లా గుడ్ బై! వచ్చే ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో(Andhra Assembly Elections) పోటీ చేయాలని లగడపాటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ నుంచి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. గుంటూరు నుంచి ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెబుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో...అక్కడ నుంచే లగడపాటి ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈయనకు గల్లా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గుంటూరులో గల్లా రెండు పర్యాయాలుగా గెలుస్తున్నారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాక కూడా లగడపాటి ద్వారా గుంటూరు ఎంపీ స్థానాన్ని మరోసారి గెలవాలని అనుకుంటోంది టీడీపీ. Also Read:ఆరోగ్యశ్రీకి 25 లక్షలు తాత, అవ్వలకు 3వేలు..జగన్ సర్కార్ కీలక నిర్ణయం #andhra-pradesh #tdp #politics #lagadapati-rajagopal #political-re-entry మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి