China border:చైనా సైనికులను ఎదిరించి నిలిచిన భారత గొర్రెల కాపరులు

భారత్, చైనా బోర్డర్‌లో మన దేశానికి చెందిన గొర్రెల కాపరులు ధైర్యసాహసాలు ప్రదర్శించారు. చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత భూభాగంలోనే గొర్రెలను మేపుతుండగా అడ్డువచ్చిన చైనా సైనికులను మన సైన్యం సాయంతో వెనక్కి పంపించారు గొర్రెల కాపరులు.

New Update
China border:చైనా సైనికులను ఎదిరించి నిలిచిన భారత గొర్రెల కాపరులు

Ladhak shepperds:భారత్, చైనా సరిహద్దు రేఖ దగ్గర ఆ దేవ సైనికులు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. మన భూభాగంలోకి కూడా చొచ్చుకుని వచ్చి మరీ అధికారం చెలాయిస్తున్నారు. దీన్ని భారత గొర్రెల కాపరులు ధైర్యంగా ఎదుర్కొన్నారు. రీసెంట్‌గా జరిగిన ఈ సంఘటన కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read:Job Mela: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. 5వేల జాబ్స్‌కు ఖమ్మంలో మెగా జాబ్‌ మేళా!

అసలు ఏం జరిగిందంటే...

జూన్ 2020 గాల్వాన్ ఘర్షణ తర్వాత భారత సరిహద్దులో ఉండే గొర్రెల కాపరులు ఈ ప్రాంతంలో పెంపుడు జంతువులను మేపడం మానేశారు. ఎప్పుడు చైనా సైన్యం అక్కడే ఉండడం, అటు వచ్చిన వారిని బెదిరించడం లాంటివి చేశారు. కానీ మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత భారత గొర్రెలకాపరులు తమ పెంపుడు జంతువులను అటువైపు తీసుకువెళ్ళారు. తూర్పు లడఖ్ సరిహద్దు ప్రాంతాల్లో పాంగాంగ్ నదికి ఉత్తర ఒడ్డున ఉన్న సంప్రదాయ పచ్చిక మైదానాల్లో పశువులను మేపేందుకు తీసుకువెళ్ళారు. అప్పుడే జరిగిందీ సంఘటన. గొర్రెలను మేపడానికి వచ్చిన కాపరులను అడ్డుకున్నారు చైనా సైన్యం. అక్కడకు రావడానికి వీల్లేదంటూ అడ్డగించారు. వారికి గొర్రెలకాపరులు ధైర్యంగా సమాధానమిచ్చారు. తాము ఇండియా భూభాగంలోనే ఉన్నామని...తమను అడ్డుకునేందుకు చైనా సైనికులను ఎటువంటి హక్కూ లేదని వాదించారు. కాపరులకు భారత సైన్యం కూడా మద్దుతుగా నిలిచింది. దీనికి సంబంధించి వీడియోను చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ ట్వీట్ చేశారు. భారత సైన్యానికి చెందిన ఫైర్ ఫ్యూరీ కార్ప్స్ అండగా నిలిచింది. పౌరులతో బలమైన సంబంధాలను నెరుపుతూ.. సరిహద్దు ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించినందుకు భారత సైన్యానికి ధన్యవాదాలు అని అందులో రాశారు.

మన భూభాగంలో మన ప్రాంతాల్లో తిరగకుండా చైనా అడ్డుకుంటోందని స్టాంజిన్ అంటున్నారు. సరిహద్దు వివాదం ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియదు..కానీ మన భూభాగాన్ని రక్షించడానికి భారత సైన్యం తర్వాత రెండో సంరక్షక శక్తిగా నిలిచిన సంచార జాతులకు నేను వందనం చేస్తున్నాను అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు.

వీడియోలో ఏముంది...

భారత గొర్రెల కాపరులను అడ్డుకునేందుకు చైనా సైన్యానికి చెందిన మూడు వాహనాలతో పాటూ చాలా మంది సైనికులు అక్కడ ఉన్నారు. వాహనాలకు చెందిన అలారాలు మోగిస్తూ గొర్రెల కాపరులను వారు హెచ్చరిస్తున్నారు. కానీ కాపరులు అక్కడే నిలబడి పీఎల్ఏ దళాతో వాదించారు. తాము భారత భూభాగంలోనే మేపుతున్నామని గట్టిగా చెప్పారు. ఇలా వాదిస్తున్న సందర్భంలో చైనా సైనికులు హద్దులు మీరిని ప్రతీసారి గొర్రెల కాపరులు హెచ్చరికగా కొట్టడానికి రాళ్ళు తీయడం కూడా వీడియోలో కనిపిస్తోంది. అయితే ఎక్కడా హింస చెలరేగలేదు. చైనా సైనికుల దగ్గర కూడా ఆయుధాలున్నట్లు కనిపించలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు