UK Election Results : బ్రిటన్‌ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం.. ఓటమిని అంగీకరించిన సునాక్

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కన్జర్వేటీవ్‌ పార్టీ 14 ఏళ్ల తర్వాత ఓటమిని చవిచూసింది. లేబర్‌ పార్టీకి 412 స్థానాల్లో గెలవగా.. కన్జర్వేటివ్ పార్టీ మాత్రం కేవలం 121 స్థానాలకే పరిమితమైంది.ఫలితాల అనంతరం ప్రధాని రిషి సునాక్‌ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు.

New Update
UK Election Results : బ్రిటన్‌ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం.. ఓటమిని అంగీకరించిన సునాక్

Britain Elections : బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కన్జర్వేటీవ్‌ పార్టీకి బిగ్‌ షాక్ తగిలింది. 14 ఏళ్ల తర్వాత ఆ పార్టీ ఓటమిని చవిచూసింది. యూకే ప్రజలు లేబర్‌ పార్టీ (Labour Party) కి 412 స్థానాల్లో గెలిపించగా.. కన్జర్వేటివ్ పార్టీ మాత్రం కేవలం 121 స్థానాలకే పరిమితమైంది. దీంతో లేబర్ పార్టీ అధినేత కీర్‌ స్టార్మర్‌ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కన్జర్వేటీవ్ పార్టీ (Conservative Party) నేత, భారత సంతతికి చెందిన ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak) ఓటమిని అంగీకరించారు. ఈ అపజయానికి తానే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గం రిచ్‌మండ్‌ అండ్‌ నార్తర్న్ అలర్టన్‌లోని పార్టీ మద్దతుదారుల్ని ఉద్దేశించి సునాక్ మాట్లాడారు. ' సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలిచింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌కు అభినందనలు. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై ప్రజలందరకీ నమ్మకం కలిగిస్తుందని' అన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. క్షమించమని కోరారు. అయితే రిషి సునాక్‌ ఈసారి కూడా ఎంపీగా గెలుపొందారు.

Also Read: లీటర్‌ పాల ధర రూ. 370…ఎక్కడంటే!

మరోవైపు ఈ ఎన్నికల భారీ విజయం సాధించిన లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ కూడా తన మద్ధతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. మీ అందరికీ కృతజ్ఞతలు. మనం సాధించాం. '14 ఏళ్ల తర్వాత ఈ దేశ భవిష్యత్తు మళ్లీ కనిపిస్తోంది. ప్రజల తీర్పు మనకు పెద్ద బాధ్యతను అప్పగించింది. కొత్త అధ్యయానాన్ని ప్రారంభిద్దాం. దేశ పునరుద్ధణ దిశగా పని చెద్దామంటూ' స్టార్మర్‌ వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండగా.. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్‌ (యూనైటెడ్ కింగ్‌డమ్‌) (UK) వ్యాప్తంగా 650 స్థానాల్లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 326 సీట్ల మెజార్టీ రావాల్సి ఉంటుంది. ఇప్పటికే లేబర్ పార్టీ మెజార్టీ మార్కును దాటేయడంతో ఇక ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుంది. గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటీవ్ పార్టీనే అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం తొలిసారిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రి పదవి చేపట్టి చరిత్ర సృష్టించారు.

Also Read: అత్యంత ఖరీదైన నగరాల్లో ‘హైదరాబాద్’ కి ఏ స్థానామో తెలుసా!

అయితే ఇటీవల ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. వలసల కట్టడి, ఇత విషయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా సునాక్‌ వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణల్లో సునాక్‌, కన్జర్వేటీవ్ పార్టీ రేటింగ్‌లు తగ్గుతూ వచ్చాయి. ఈసారి లేబర్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి రానుందని ఒపినియన్ పోల్స్‌ కూడా చెప్పాయి. చివరికి అదే నిజమైంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు