కొండా సురేఖపై క్రిమినల్ కేసు.. కేటీఆర్ కు కోర్టు కీలక ఆదేశాలు! తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ నెల 18న కోర్టుకు హాజరై వాంగ్మూలం సమర్పించాలని కేటీఆర్ ను న్యాయస్థానం ఆదేశించింది. By B Aravind 14 Oct 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి KTR Vs Konda Surekha: ఇటీవల మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసందే. తనపై నిరాధార ఆరోణలు చేసినందుకు కేటీఆర్ ఆమెపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. అయితే సోమవారం ఈ వ్యవహారంపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. న్యాయస్థానం దీనిపై వివరణ ఇవ్వాలని కేటీఆర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న కేటీఆర్ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వనున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి వాంగ్మూలం ఇవ్వనున్నారు. Also Read: తెలంగాణ విద్యార్థి హత్య కేసు.. నిందితునికి 60 ఏళ్ల శిక్ష సాక్షులుగా దాసోజు శ్రవణ్, బాల్క సుమన్ కేటీఆర్‌తో పాటు సాక్షులు కూడా వాంగ్మూలం నమోదు చేయనున్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దాసోజు శ్రావణ్ కుమార్, బాల్క సుమన్ కేటీఆర్‌కు సాక్షులుగా ఉన్నారు. అక్కినేని నాగచైతన్య, సమంత (Samantha) విడిపోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ ఇటీవల మీడియాతో వ్యాఖ్యానించారు. ''ఎన్ కన్వెన్షన్‌ని (N Convention) కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరికి పంపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇందుకు సమంత ఒప్పుకోకపోవడంతో నాగార్జున (Nagarjuna) ఇంటి నుంచి గెంటేశారు'' అని కొండా సురేఖ అన్నారు. కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. Also Read: చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్.. తొలిసారిగా ఇంజినీరింగ్ అద్భుతం దీంతో కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. తనపై ఆమె చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఇదే కేసులో హిరో నాగార్జున కూడా కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కూడా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. నాగార్జున మేనకోడలు సుప్రియా కూడా ఈ కేసులో నాగార్జున తరఫున కోర్టుకు హాజరయ్యారు. సాక్షిగా తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా కోర్టులో సాక్షి వాంగ్మూలం ఇచ్చారు. Also Read: Sai Babaకి ప్రముఖుల నివాళులు.. కోదండరాం, అల్లం నారాయణ సహా.. Also Read: డెంగ్యూ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది.. మీ పిల్లలను ఇలా కాపాడుకోండి..? #ktr #konda-surekha #samantha #nagarjuna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి