Telangana : పోరాట పంథాలో కదం తొక్కుతాం.. ఉద్యమ రోజులను గుర్తుకు తెస్తూ జంపింగ్ లపై కేటీఆర్ ట్వీట్

ఎవరు ఎటు పోయినా...ఎలా వెళ్ళిపోయినా పర్వాలేదు...శూన్యం నుంచి సునామీ సృష్టించిన ఘనత కేసీఆర్‌కుంది అంటూ ఎమోషనల్ ట్వీ్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరుసపెట్టి పార్టీని వీడి నేతలు వెళ్ళిపోతున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్‌ను చేశారు.

New Update
Telangana : పోరాట పంథాలో కదం తొక్కుతాం.. ఉద్యమ రోజులను గుర్తుకు తెస్తూ జంపింగ్ లపై కేటీఆర్ ట్వీట్

KTR Tweet : ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేశారు. అవమానాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఎదిరించి ధైర్యంగా నిలబడ్డ ధీశాలి కేసీఆర్(KCR) అంటున్నారు ఆయన కొడుకు, బీఆర్ఎస్(BRS) ముఖ్యనేత కేటీఆర్(KTR). కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్లిపోతున్న వాళ్లను ప్టించుకోనవసరం లేదని... పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని అన్నారు. దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు.. తెలంగాణ(Telangana) ప్రజలే జవాబు చెప్తారన్నారు.
ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా నిన్న కాడియం శ్రీహర్ఇ కూడా పార్టీ వీడి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈ ఎమోషనల్ ట్వీట్‌ను చేశారు.

శూన్యం నుండి సునామీ సృష్టించిన వ్యక్తి కేసీఆర్ అని.. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి రోరాటలం చేసిన ధీరుడని అన్నారు కేసీఆర్. ఎవరున్నా లేకపోయినా ఆయన ధైర్యంగా ముందుకు వెళ్లగలరని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను ఎదురొడ్డి.. నిఖార్సయిన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తామని చెప్పారు. మళ్ళీ పోరాట పంథాలో కదం తొక్కుతాం అని చెప్పారు.

Also Read : Movies : టిల్లు స్క్వేర్ కూడా హిట్టయ్యేట్టు ఉందిగా..ట్విట్టర్ రివ్యూ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు