Dhanush : ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణే.. కానీ ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది : ధనుష్

తమిళ్ హీరో ధనుష్. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన 'రాయన్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ ఈ కోరికను వ్యక్తం చేశారు. అలాగే తన ఫేవరెట్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని..' ఐ లవ్ పవన్ కళ్యాణ్ సర్' అంటూ చెప్పుకొచ్చారు.

New Update
Dhanush : ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణే.. కానీ ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది : ధనుష్

Kollywood Star Dhanush About Pawan Kalyan And Junior NTR : కోలీవుడ్ స్టార్ ధనుష్.. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన 'రాయన్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ ఈ కోరికను వ్యక్తం చేశారు. ధనుష్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. టాలీవుడ్​లో తన ఫేవరెట్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని వెల్ల‌డించారు. 'ఐ లవ్ సినిమా, ఐ లవ్ పవన్ కళ్యాణ్ సర్' అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత యాంక‌ర్ ‘ఒకవేళ మల్టీ స్టారర్ చేయాలంటే ఎవరితో చేస్తారు?

సూపర్ స్టార్ మహేశ్​ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్. వీరిలో ఎవరితో చేస్తారు? అని అడుగుతుంది. దీనికి ధనుష్ బదులిస్తూ.." నేను టాలీవుడ్ లో చాలా మంది హీరోలను ఇష్టపడతాను. కానీ నాకు ఎంతో ఇష్టమైన హీరోల్లో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. ఆయన నటన అద్భుతం. స్క్రీన్ పై ఎంతో ఎనర్జీ చూపిస్తారు. తారక్ తో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని నాకు ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది" అని ధనుష్ తెలిపారు. ధనుష్ కామెంట్లకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా స్పందిస్తున్నారు.

Also Read : బిగ్ బాస్ హౌస్‌లో లైవ్‌లో శృంగార వీడియో.. చిఛీ.. ఏందీ రోత..?

ధనుష్ - తారక్ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ధనుష్, ఎన్టీఆర్ ఇద్దరూ ప్రస్తుతం బిజీగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో వారిద్దరికీ కలిసి నటించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ధనుష్ కోరిక నెరవేరితే, ఖచ్చితంగా ఇది ఒక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుందని ఇరువురి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇక ఇటీవల ధనుష్ తెలుగులో 'సార్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ధనుష్ 'రాయన్' అనే తమిళ సినిమాలో నటించారు. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది. జులై 26 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Imanvi Esmail నేను పాకిస్థానీ కాదు.. ప్రభాస్ హీరోయిన్ సంచలన ప్రకటన

ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ పాకిస్థాన్ అమ్మాయని, ఆమెను బ్యాన్ చేయాలని వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. నా కుటుంబంలో ఎవరూ పాకిస్తానీ మిలిటరీతో సంబంధం కలిగిలేరు. నేను గర్వించదగ ఇండోఅమెరికన్. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయడం ఆపేయండి అని పోస్ట్ పెట్టింది.

New Update
Actress Imanvi: ప్రభాస్ హీరోయిన్ గా మిలటరీ ఆఫీసర్ కూతురు..! ఎవరీ ఈ బ్యూటీ..?

Fauji Actress Imanvi:  పహాల్గమ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీ నటీనటులు మన సినిమాల్లో నటించడానికి, వాళ్ళను ప్రోత్సహించడానికి వీల్లేదని సోషల్ మీడియా పోస్టుల రూపంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో ప్రభాస్ ' ఫౌజీ'  హీరోయిన్ ఇమాన్వీ పై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఆమె పాకిస్థానీ మూలాలు ఉన్న అమ్మాయని, అమెరికాలో సెటిల్ అయ్యేముందు ఆమె తండ్రి పాకిస్థాన్ ఆర్మీలో మేజర్ గా పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో  నెటిజన్లు సినిమా నుంచి ఆమెను బ్యాన్ చేయలాంటు పోస్టులు చేయడం మొదలు పెట్టారు.

నేను పాకిస్థానీ కాదు..  

ఈ నేపథ్యంలో తాజాగా నటి ఇమాన్వీ ఈ వివాదంపై స్పందించింది. తాను పాకిస్థానీ కాదంటూ స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. అలాగే ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. 

ఇమాన్వీ పోస్ట్.. 

ఇమాన్వీ తన పోస్టులో ఇలా రాసుకొచ్చింది.. నా కుటుంబానికి సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ పుకార్లను, అబద్దాలను  నేను పరిష్కరించాలనుకుంటున్నాను.  నా కుటుంబంలో ఎవరూ ఇప్పటివరకు పాకిస్థానీ మిలిటరీతో ఏ విధంగానూ సంబంధం కలిగిలేరు. ద్వేషాన్ని పుట్టించాలనే ఏకైక ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. నేను లాస్ ఏంజిల్స్ లో పుట్టాను. నా తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికాకు యువతగా వలస వచ్చారు. ఆ తర్వాత అమెరికా పౌరులుగా మారారు.  నేను హిందీ, తెలుగు, గుజరాతీ,  ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన ఇండోఅమెరికన్  అంటూ క్లారిటీ ఇచ్చింది. కొన్ని పేరున్న వార్త సంస్థలు కూడా నా గురించి కనీస రీసర్చ్ చేయకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి అంటూ రాసుకొచ్చారు. 

ఇమాన్వీ అమెరికాలోని విశ్వవిద్యాలయంలో తన విద్యాబ్యాసాన్ని పూర్తి చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా, నటిగా, కొరియోగ్రాఫర్‌గా, పనిచేస్తూ కళల పట్ల తన ఇంట్రెస్ట్ కొనసాగించానని.. ఇప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో పనిచేసే అవకాశం దక్కినందుకు కృతజ్ఞతలు అని తెలిపింది. 

telugu-news | cinema-news | actress-imanvi | Prabhas Fauji | latest-news

Advertisment
Advertisment