Kolkata Murder: హింసాత్మక పోర్న్ చూస్తూ ట్రైనీ డాక్టర్ మర్డర్.. పోస్ట్‌మార్టంలో భయంకర నిజాలు!

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ మర్డర్ కేసులో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు సంజయ్ ఆమె పెదవులు, గోళ్లు, మెడ, నాభి, ప్రైవేట్ పార్ట్స్‌పై క్రూరంగా దాడిచేసినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో బయటపడ్డాయి. క్రూరమైన పోర్న్ చిత్రాలు చూస్తూ అతను ఈ ఘోరానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు.

New Update
Kolkata Murder: హింసాత్మక పోర్న్ చూస్తూ ట్రైనీ డాక్టర్ మర్డర్.. పోస్ట్‌మార్టంలో భయంకర నిజాలు!

Kolkata Trainee Doctor Case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసులో సంచలనం నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు సంజయ్ (Sanjay) మొదట ఆమెను హత్య చేసి ఆ తర్వాత రేప్ చేసినట్లు పోలీసులు నిర్దారించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఆమె పెదవులు, కళ్లు, గోళ్లు, మెడ, కడుపు, నాభి, నోరు, కుడి చేయి, ఎడమ కాలుపై తీవ్రమైన గాయాలుండటంతోపాటు రక్తస్రావం అయినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్ పట్ల ఆ దుర్మార్గుడు క్రూరంగా ప్రవర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మర్మాంగంనుంచి కూడా చాలా రక్తం కారినట్లు చెప్పారు. ఆమె కేకలు వేస్తుండగా మొదట తలను బలంగా గోడకు కొట్టాడని, దీంతో ఆమె మూర్చపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఆధారాలతోనే ముందుగా యువతిని చంపి, ఆ తర్వాత అత్యాచారం చేసినట్లు అంచనా వేశామని పోలీసులు చెబుతున్నారు.

చెడు అలవాట్లకు బానిసై..
ఇక ఈ మర్డర్ చేసిన సంజయ్ ఇంటికి వెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా పడుకున్నట్లు చెప్పారు. ఆ మరుసటి ఉదయం తన బట్టల మీద రక్తపు మరకలు లేకుండా ఉతికేసుకున్న సంజయ్.. షూలను శుభ్రం చేయడం మరిచిపోగా వీటి ఆధారంగానే సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్ చాలా రోజుల నుంచి మద్యానికి అలవాటు పడి, చెడు ప్రవర్తన కలిగి ఉన్నాడని, అతని జీవనం విధానం నచ్చకపోవడంతో ముగ్గురు భార్యలు విడిచిపెట్టడంతో నాలుగో పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

హింసాత్మక పోర్న్ కంటెంట్.. 
అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని నుంచి మరింత డేటాను రాబడుతున్నారు. 'మేము అతని ఫోన్ నుంచి పూర్తి డేటాను బయటకు తీస్తాం. దర్యాప్తు చేస్తున్న సిబ్బంది నుంచి వాంగ్మూలాలను సేకరించాం. నిందితుడు అశ్లీల చిత్రాలకు అలవాటు పడ్డాడు. అతని మొబైల్ ఫోన్‌లోని అశ్లీల కంటెంట్ చాలా హింసాత్మకంగా ఉంది. అదే అతని మానసిక స్థితిని తెలియజేస్తుంది. అలాంటి వాటిని చూడటం అసహజంగా అనిపిస్తోంది' అని పోలీసు అధికారి వివరించారు.

ఇది కూడా చదవండి: AP: మాధురి మంచిది.. ఆమెను వదలను.. భర్త సంచలన కామెంట్స్!

మరోవైపు సంజయ్ ను కఠినంగా శిక్షించాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అతన్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. అతడి తల్లి మాలతీ రాయ్ మాత్రం తన కొడుకు నిర్ధోషి అని వాదిస్తోంది. పోలీసుల ఒత్తిడితోనే చేయని నేరం అంగీకరించాడని చెబుతోంది. ఇక ఆగస్టు 18 లోగా పోలీసులు కేసును చేధించలేకపోతే దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

#sanjay-roy #kolkata #kolkata-trainee-doctor-murder-case #crime news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Crime News: నాశనమైపోతార్రా.. 5 ఏళ్ల చిన్నారిని చంప...

Crime News: నాశనమైపోతార్రా.. 5 ఏళ్ల చిన్నారిని చంపి.. తల్లిపై మైనర్లు రేప్

హర్యానాలోని జింద్‌లో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై నలుగురు దుండగులు దాడి చేశారు. అందులో 5ఏళ్ల చిన్నారిని చంపి చెత్తకుండీలో పడేశారు. ఆపై బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఆమె స్పృహ కోల్పోవడంతో అక్కడ నుంచి పరారయ్యారు.

New Update
Rape and murder Haryana

Rape and murder Haryana

కామాంధుల ఆగడాలు పెరిగిపోయాయి. ఆడది కనిపిస్తే చెలరేగిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా క్రూర మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటిదే ఓ దారుణం జరిగింది. ఇంట్లో తన ముగ్గురు బిడ్డలతో నిద్రిస్తున్న ఓ మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉండటం సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

5 ఏళ్ల చిన్నారిని చంపి

ఈ ఘటన హర్యానాలోని జీంద్‌లో జరిగింది. మంగళవారం రాత్రి ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో గుడిసెలో నిద్రిస్తుంది. దీంతో ఆమె భర్త లేడని తెలుసుకున్న నలుగురు దుండగులు ఆ గుడిసెలోకి వెళ్లారు. అనంతరం పిల్లలతో కలిసి నిద్రిస్తున్న బాధితురాలిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

అదే సమయంలో ఆ బాధితురాలితో పాటు 5 ఏళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్తకుప్ప వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆ చిన్నారి గొంతు నులిమి హత్య చేశారు. ఆపై బాధితురాలి పై దుండగులు నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఇక గొంతునులిమి హత్య చేసిన చిన్నారి.. డెడ్ బాడీ రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. ఇక గురువారం ఆ బాధితురాలు స్పృహలోకి వచ్చి.. జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై ఎస్‌ఐ. యశ్‌వీర్ మాట్లాడుతూ.. ఇందులో నిందితుడు అమిత్‌ అనే వ్యక్తితో సహా మరో ముగ్గురు మైనర్లు ఉన్నారని వెల్లడించారు. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

telugu-news | crime news | Minor Girl Rape | latest-telugu-news | girl raped and murdered

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు