/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-32-3.jpg)
Polygraph Test: దేశంలో ప్రస్తుతం మారుమోగుతున్న విషయం జూనియర్ డాక్టర్ హత్యోదంతం. రేప్‌తో స్టార్ అయిన ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ధర్నాలు, ఆందోళనలతో దేశం అట్టుడికిపోతోంది ఒకవైపు. మరోవైపు సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి చూశారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయం కావాలి అంటూ నిరసన చేశారు. దీంతో ఈ వ్యవహారం చాలా సీరియస్ అయిపోయింది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రైనీ డాక్టర్ రేప్, హత్య చేశాడంటూ అరెస్ట్ చేసిన సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐకి కోలకత్తా హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ఈనెల 20న అంటే రేపు సీబీఐ అధికారులు సంజయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నారు.
ఇక కోల్‌కతా జూనియర్ డాక్టర్ అభయ పోస్టుమార్టం రిపోర్టులో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు బలంగా గొంతు నొక్కడం వల్లే అభయ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె శరీరంలో చాలా ఎముకలు విరిగిపోయాయి. తల, బుగ్గలు, ముక్కు, కుడి దవడ, గడ్డం, మెడ, ఎడమ చేయి, ఎడమ భుజం, ఎడమ మోకాలు, చీలమండ, జననేంద్రియాలతో పాటు వివిధ శరీరభాగాలపై మొత్త 14 గాయాలున్నట్లు రిపోర్టులో వైద్యులు ప్రస్తావించారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం, శరీరంలోని ఇతర భాగాల్లో రక్తం గడ్డ కట్టినట్లు నిర్ధారించారు.
Also Read: Mamata: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా? అభయ కేసులో నిరసనలు!
AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
గడచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని కల్లారా చూసామని, ఆ విధ్వంసం నుంచి కోలు కోవడానికి చాలా కష్టపడాలి. జగన్ పార్టీ నేరాలు హత్యలు అవినీతి అరాచకం అణచివేత మీద నిర్మించ బడిందని ఏపీ మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
AB Venkateswara Rao
AB Venkateswara Rao :గడచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని కల్లారా చూసామని, ఆ విధ్వంసం నుంచి కోలు కోవడానికి చాలా కష్టపడాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీ నేరాలు హత్యలు అవినీతి అరాచకం అణచివేత కులాల మీద నిర్మించ బడిందని ఏపీ మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రానికి ,ఆంధ్ర సమాజానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం..పెద్ద ఉపద్రవం వైయస్ జగన్, ఆయన వైయస్సార్ పార్టీ అన్నారు. సమాజానికి పెద్ద ప్రమాదం వైఎస్ జగన్ అని, ఆయన పాలనలో వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి, ప్రజాస్వామ్య విలువలు విధ్వంసం అయ్యాయన్నారు.
Also read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నా వంతు నేను పని చేస్తానని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాకు వద్దు అని ప్రజలు నిశ్చయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు..బలహీనులు,బాధితులకి సాయం చేయడం కోసం వాళ్లకి అండగా ఉండడం కోసం అలాగే అన్యాయాలు జరిగితే ఎదురు నిలవడం కోసం తప్పులు సరిదిద్దడానికి ప్రజల ఆలోచనలను నాకు జ్ఞానం ఉన్నంతవరకు అవగాహన చేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని స్పష్టం చేశారు.
Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
నా దృష్టిలో రాజకీయాలంటే సమాజ స్థితిగతుల్ని అవగాహన చేసుకుని జరిగినటువంటి తప్పులను సవరించుకొని తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడుతూ ఒక మెరుగైన భవిష్యత్తు కోసం సమాజాన్ని నడిపించడంలో చురుకైన పాత్ర పోషించడమే అన్నారు.రాజకీయాలంటే పదవి, అధికారము రాజకీయం కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో రాజకీయాలంటే అరాచకం అడ్డొచ్చిన వాళ్ళని అణిచివేయడం అని వెల్లడించారు.ప్రజల్ని కులాలు ,మతాలు, ప్రాంతాలు వర్గాలుగా విడదీసి ఒకళ్ళ మీద ఒకరు ఎగదోసి ఆ సందర్భంలో తన దోపిడీని కొనసాగించుకోవచ్చని మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని త్వరలో రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.
Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ
Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ