Kohli Gill : ఆ లిస్ట్‌లో గిల్ నంబర్-1.. సెకండ్ కోహ్లీ.. థర్డ్ ఎవరంటే? SAపై జరిగిన మూడో టీ20లో సూర్య 100 పరుగులు చేయగా.. ప్రొటీస్ టీమ్ 95 రన్స్‌తో సరిపెట్టుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ నుంచి ఇలా ఒక ప్లేయర్ చేసిన రన్స్ కంటే ప్రత్యర్థి టీమ్ తక్కువ రన్స్ చేయడం ఇది మూడోసారి. గతంలో గిల్, కోహ్లీ సెంచరీ చేసినప్పుడు ఇలానే జరిగింది. By Trinath 15 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి 3rd T20 : దక్షిణాఫ్రికా(South Africa)పై మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది సూర్య టీమ్. సిరీస్‌ను సమం చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 201 పరుగులు చేసింది. కెప్టెన్ , ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో ధనాధనా ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య మెరుపు శతకంతో భారత్ భారీ స్కోరు చేసింది. అటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా రాణించాడు. 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 60 పరుగులు చేశాడు. ఇక లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా చతికిలపడింది.13.5 ఓవర్లకే ఆలౌట్ అయ్యింది. 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) 17 పరుగులకు 5 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో కుల్దీప్‌కి ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. ప్రతీకాత్మక చిత్రం ALSO READ: భారత్ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. కుల్దీప్ రికార్డుకు సెల్యూట్ కొట్టాల్సిందే! సూర్య కంటే తక్కువ రన్స్: ఒక ప్లేయర్ చేసిన పరుగుల కంటే ప్రత్యర్థి జట్టు తక్కువ రన్స్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. దక్షిణాఫ్రికాపై మ్యాచ్‌లో ఆ రేర్ సీన్ కనిపించింది. బ్యాటింగ్‌లో ఇరగదీసిన సూర్యకుమార్ 100 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 95 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది. అంటే సూర్య కంటే 5 పరుగులు తక్కువ చేసింది. ఇలా అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌కు గతంలో రెండుసార్లు జరిగింది ఫస్ట్ గిల్: ఈ ఏడాది కివీస్‌తో భారత్ టీ20లు ఆడింది. సిరీస్‌లో ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 1న గుజరాత్-అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 234 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లో 126 రన్స్ చేశాడు యువ ఓపెనర్ శుభమన్ గిల్. ఇందులో 12 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అంటే గిల్ కంటే కివీస్ 60 రన్స్ తక్కువ చేసింది. ఇక గతేడాది(2022) ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా అఫ్ఘాన్‌పై జరిగిన మ్యాచ్‌లో రన్ మెషీన్ కోహ్లీ సెంచరీతో మెరిశాడు. దాదాపు మూడేళ్ల తర్వాత కోహ్లీ చేసిన తొలి సెంచరీ అది. 61 బంతుల్లో 122 రన్స్ చేశాడు కోహ్లీ. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్ 20ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 111 రన్స్‌తో సరిపెట్టుకుంది. అంటే కోహ్లీ చేసిన రన్స్ కంటే 11 రన్స్ తక్కువ చేసిందన్నమాట. Also Read: సచిన్, కోహ్లీ సరసన సూర్యాభాయ్.. రికార్డుల జాతర! WATCH: #virat-kohli #cricket #suryakumar-yadav #india-vs-south-africa #shubman-gill #3rd-t20 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి