Japan Earth Quakes:జపాన్‌లో ఎందుకు ఎక్కువ భూకంపాలు వస్తాయి? కారణం ఇదే.

తాజా జపాన్ భూకంపంతో అక్కడా ప్రజలు భయభ్రాంతులు అయ్యారు. వందల ఇళ్ళు నేల మట్టం అయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. అయితే వీరికి ఇది చాలా తరుచుగా జరిగే విషయం. జపాన్‌కు భూకంపాలు చాలా ఎక్కువ. దీనికి కారణం ఏంటో తెలుసా?

New Update
Japan Earth Quakes:జపాన్‌లో ఎందుకు ఎక్కువ భూకంపాలు వస్తాయి? కారణం ఇదే.

Japan:ప్రపంచమంతా కొత్త సంవత్సర జోష్‌లో ఉన్న ఈ సమయంలోనూ జపాన్‌ వణికిపోయింది. రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో భూమి కంపించింది. ఒక్కరోజులోనే 155సార్లు భూకంపం వచ్చింది. చాలా చోట్ల రోడ్లకు బీటలు వారాయి. భవనాలు కూలిపోయాయి. సముద్రపు అలలు ఎగిసి పడ్డాయి. సునామీ హెచ్చరికలు జారీ చేశారు.సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ శిథిలాల కింద ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు చిక్కుకునే అవకాశం ఉంది. సునామీ హెచ్చరికలతో ఆ ప్రాంత వాసులను తమ ఇళ్లను ఖాళీ చేయాలని హెచ్చరించారు. ప్రజలను సురక్షిత శిబిరాల్లో ఉంచుతున్నారు.

Also Read:స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత

అయితే జపాన్‌లో భూకంపాలు రావడం చాలా సహజం. లాస్ట్ టైమ్ సునామీ వచ్చినప్పుడు కూడా జపాన్‌లో భారీ నష్టమే జరిగింది. దీనికి కారణం ఏంటి...జపాన్‌్లో ఎందుకు భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలంటే... ఆదేశ భౌగోళిక పరిస్థితులను అవగాహన చేసుకోవాలి. అసలు ముందు అన్నిచోట్ల కంటే ప్రపంచంలోనే ఎక్కువగా భూకంపాలు వచ్చేది పసిఫిక్ సముద్ర ప్రాంతంలోనే. దాదాపు 80% భారీ భూకంపాలు ఇక్కడే నమోదవుతాయి. ఈ తీరంలోనే ఉన్న జపాన్‌లో తరచూ భూమి కంపిస్తూ ఉంటుంది. భూమి లోపల టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. వీటిని భూమి పలకలు అంటారు. జపాన్‌ పషిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రీజియన్‌లో ఉంటుంది. ఇది గుర్రపుడెక్క ఆకారంలో ఉంటుంది. అంటే పసిఫిక్ సముద్రం చుట్టూ రింగ్‌లా ఉంటుంది జపాన్. ఇది భూకంపాలు రావడానికి, అగ్ని పర్వతాలు పేలడానికి చాలా అనువైన ప్రాంతం. ఇక్కడ మూడు టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. పసిఫిక్ సముద్రం, ఫిలిప్పైన్ సీ ప్లేట్ వీటి పైన పసిఫిక్ ప్లేట్ ఉంటాయి. వీటిని టెక్నికల్‌గా కాంటినెంటల్, ఓషన్ ప్లేట్స్ అని పిలుస్తారు. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానికి ఒకటి ఢీకొట్టుకునే ప్రాంతంలో ఉంది జపాన్.అందుకే...పదేపదే ఇక్కడ భూకంపాలు వస్తుంటాయి. సముద్రానికి కింద లేదా దగ్గర్లో భూ ప్రకంపనలు వస్తే అది సునామీకి దారి తీస్తుంది. జపాన్‌లో భూకంపం వచ్చిన ప్రతిసారీ సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు.ఇక్కడి భూమిలోపలి పలకలు ఒక్కసారిగా కదిలిపోతాయి. భూమిలోపలి ఉష్ణోగ్రతలు, ఒత్తిడి కారణంగా ఈ ప్లేట్స్‌ కదులుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే అవి ఢీకొట్టుకుంటాయి.

జపాన్‌లో ఈసారి వచ్చిన భూకంపం కంటే పెద్ద పెద్దవే ఇతంకు ముందు వచ్చాయి. అందుకే ఈ దేశంలో ఇళ్ళు, భవనాలు వాటికి తట్టుకునే విధంగా కట్టుకుంటారు. ఒకవేళ కూలిపోయినా ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేలా చూసుకుంటారు. ఎక్కువగా చెక్కతోనే ఇళ్ళను, భవనాలను నిర్మించుకుంటారు. దీంతో పాటూ ఇక్కడి బిల్డింగ్స్‌లో సెసెమిక్ ఐసోలేషన్ బేరింగ్స్ వాడతారు. భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్‌ హారిజాంటల్‌గా కదిలేలా చేస్తాయి . ఈ బేరింగ్స్ ఫలితంగా బిల్డింగ్‌పై ఒత్తిడి తగ్గి డ్యామేజ్‌ తగ్గిపోతుంది. ఈ బేరింగ్స్‌తో పాటు కాంక్రీట్‌ ఫ్రేమ్స్‌నీ ఏర్పాటు చేస్తోంది. భవనాలు కూలిపోకుండా ఇవి అడ్డుకుంటాయి. భూకంపాన్ని ముందుగా పసిగట్టే అర్లీ వార్నింగ్ సిస్టమ్‌నీ ఏర్పాటు చేసుకుంటారు. దీని ద్వారా ముందుగానే భూకంపాలను పసిగట్టి బయటకు వచ్చేయగలుగుతారు. ఎప్పుడైనా భూమి కంపించినప్పుడు ఆటోమెటిక్‌గా గ్యాస్, ఎలక్ట్రిసిటీ సప్లై నిలిచిపోతుంది. ఆటో మేటిక్ ఫైర్ ఎక్సిట్వింగ్షింగ్ సిస్టమ్‌తోనూ నష్టాన్ని చాలా వరకూ కంట్రోల్ చేయగలుగుతున్నారు.

అయితే ఇన్ని చూస్తున్నా జపాన్‌లో బారీ నష్టం మాత్రం తప్పడం లేదు. ఇక్కడ తరుచూ వస్తున్న భారీ భూకంపాలు వీళ్ళ జీవితాలను అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఛత్తీస్‌ఘఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు మృతి.. కొనసాగుతున్న కాల్పులు

ఛత్తీస్‌ఘఢ్‌లో బీజాపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దు బైరాంఘడ్ అటవీ ప్రాంతంలో 400 మంది జవాన్లు మావోయిస్టులను చుట్టుముట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇందులో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

New Update
Encounter in Chhattisgarh’s Bijapur leaves two Naxals, one cop dead

Encounter in Chhattisgarh

ఛత్తీస్‌ఘఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దు బైరాంఘడ్ అటవీ ప్రాంతంలో 400 మంది జవాన్లు మావోయిస్టులను చుట్టుముట్టారు. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య పరస్పరం కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా మావోయిస్టుల మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!

22 మంది కీలక కమాండర్లు..

ఇదిలా ఉండగా మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే వరుస ఎన్ కౌంటర్లతో భారీగా నష్టపోతుండగా తాజాగా మరికొంతమంది దళ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెనికి చెందిన 22 మంది కీలక కమాండర్లు సరెండర్ అయినట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ తెలిపారు. ఈ మేరకు ‘పోరుకన్నా ఊరుమిన్న.. మన ఊరికి తిరిగిరండి’ అనే కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని శబరీష్ చెప్పారు.  అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం అందించే సదుపాయాలను అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా లొంగిపోయిన వారి వివరాలను వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన ముచ్చకి జోగారామ్, ఏరియా కమిటీ మెంబర్‌ మడవి మాస, తుమ్మిరిగూడకు చెందిన తాటి జోగా, పార్టీ దళ సభ్యులు పూనెం సుక్కు, జనతన సర్కారు కమిటీ అధ్యక్షుడు కోరం పాపారావు, సభ్యులు రౌతు హనుమయ్య, హనుమ మడవి, వెట్టి వెంకన్న, మాస సోడి, మడకం దేవా, కల్లూరి శాంత, కల్లూరి తిరుపతమ్మ, మజ్జి నాగరత్న, మజ్జి తిరుపతమ్మ, మజ్జి సుశీల మడవి జోగా, బిరబోయిన నారాయణ, సోడి మాసు, దూడి జయరాం, మజ్జి విజయ్, షూరిటీ రవన్న, కొత్తకొండ మజ్జి హైమవతి లొంగిపోయినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ లో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఆర్‌పీఎఫ్‌ పీఎంజీ పంచమీలాల్, డీఎస్పీ ఎన్‌.రవీందర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నట్లు వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

 

Advertisment
Advertisment
Advertisment