/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/kl-rahul-jpg.webp)
కేఎల్ రాహుల్(KL Rahul) ఆపద్బాంధవుడుగా మారాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును నిలబెట్టాడు. టీమిండియా పరువు పోకుండా కాపాడాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా(South Africa)పై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ రెండో రోజు ఫస్ట్ సెషన్‌లో ఆలౌట్ అయ్యింది. నిన్న వర్షం కారణంగా మ్యాచ్ 31 ఓవర్లు తక్కువగా సాగింది. ఇవాళ(డిసెంబర్ 27) అరగంట ముందే మ్యాచ్ మొదలవగా.. సిరాజ్‌తో కలిసి రాహుల్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. సెంచరీతో అదరగొట్టాడు.
Sixxx 6️⃣ go get a century at Centurion 💯
No KL Rahul fan will Pass without liking this shot🔥#KLRahul #INDvsSA #SAvIND pic.twitter.com/QHjL1s5zom
— Savlon Bhoi (@First_follow_me) December 27, 2023
రాహుల్ అదుర్స్..కానీ ప్చ్:
ఓవర్‌నైట్ స్కోర్ 8 వికెట్లకు 208తో రెండు రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 37 రన్స్ మాత్రమే చేయగలిగింది. అయితే రాహుల్ టెస్టుల్లో 8వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిన్న ఆచుతూచీ బ్యాటింగ్ చేసిన రాహుల్ 73స్ట్రైక్ రేట్‌తో సెంచరీ చేయడం విశేషం. అటు సిరాజ్ కాసేపు సపోర్ట్ ఇచ్చాడు. 22 బంతుల్లో 5 పరుగులు చేసిన సిరాజ్ జట్టు స్కోరు 238 వద్ద 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత 245 రన్స్ వద్ద భారత్ ఆలౌట్ అయ్యింది.
MAN OF CRISIS OF INDIA🇮🇳
Klassy 💯 from KL Rahul
A Knock that's remembered for a long time 🙌🇮🇳#KLRahul #INDvsSApic.twitter.com/b3tWOIH6t6— Aman Raina (@ImRaina45) December 27, 2023
నిరాశపరిచిన టాపార్డర్:
అంతకముందు (నిన్న) టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. పేసర్లకు అనుకూలిస్తోన్న పిచ్‌పైకి ఓపెనర్లగా రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ దిగారు. రోహిత్ మరోసారి ఫోకస్ తప్పాడు. 14 బంతుల్లో 5 పరుగులు చేసిన రోహిత్ అనవసర షాట్ ఆడాడు. రబాడా బౌలింగ్‌లో బర్గర్ క్యాచ్‌కు రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో 13 పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత టీమ్ స్కోరు 23 వద్ద రెండో వికెట్ కోల్పోయింది. మంచి టచ్‌లో కనిపించిన యాశస్వీ బర్గర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 37 బంతుల్లో యశస్వీ 17 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత వెంటనే శుభమన్ గిల్ ఔట్ అయ్యాడు. కేవలం రెండు పరుగులకే బర్గర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత భారత్ బ్యాటింగ్ భారాన్ని కోహ్లీ, అయ్యర్ మోశారు. ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే లంచ్ బ్రేక్ తర్వాత భారత్‌కు షాక్ తగిలింది. 50 బంతుల్లో 31 రన్స్ చేసి రబాడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటి 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అప్పటికీ భారత్ 107 రన్స్‌కు 5 వికెట్లు కోల్పోయి ఉంది. ఇక టీమిండియా 150 దాటడమే కూడా కష్టమే అనుకున్నారు.
పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను కీపర్ రాహుల్ ఆదుకున్నాడు. అశ్విన్ త్వరగా వెనుతిరగగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శార్దూల్ ఠాకూర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అప్పటికీ ఆరు వికెట్లు పడిపోవడంతో రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కపెట్టే బాధ్యత తీసుకున్న ఠాకూర్ పర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో ఏడో వికెట్‌గా వెనుతిరిగాడు. రబాడా వేసిన ఆ ఓవర్‌లో షార్ట్ మిడాఫ్‌లో ఎల్గర్‌కు దొరికిపోయాడు. మరో ఎండ్‌లో రాహుల్ మాత్రం ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటాడు. ఇక కాసుపు ఓపికగా ఆడిన బుమ్రా మార్కో జెన్సన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సిరాజ్ బ్యాటింగ్‌కు దిగగా.. కాసేపటికి వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 5 వికెట్లు తీశాడు. బర్గర్ మూడు వికెట్లతో రాణించాడు.
Also Read: మేం దేశద్రోహులమా? అవార్డులను వెనక్కి ఇస్తున్నా.. మోదీకి వినేశ్‌ఎమోషనల్ లెటర్!
WATCH: