RAHUL: ఈ సిరీస్‌లో రాహుల్ వికెట్ కీపర్‌గా ఆడటం లేదు.. ద్రవిడ్ ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా ఆడటం లేదని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కోసం కెఎస్ భరత్, ధృవ్ జురెల్ లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. By srinivas 23 Jan 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Ind Vs Eng: ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ (KL RAHUL) వికెట్ కీపింగ్ చేయడం లేదని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (DRAVID) ధృవీకరించాడు. ఈ నిర్ణయం గురించి జట్టుకు స్పష్టత ఉందని, వికెట్ కీపర్-బ్యాటర్ పాత్ర కోసం ఇప్పుడు కెఎస్ భరత్, ధ్రువ్ జురెల్ ల పేర్లను పరీశీలిస్తున్నట్లు ద్రవిడ్ పేర్కొన్నాడు. మేము స్పష్టంగా ఉన్నాం.. ఈ మేరకు 'రాహుల్ ఈ సిరీస్‌లో వికెట్ కీపర్‌గా ఆడటం లేదు. మేము దాని గురించి స్పష్టంగా ఉన్నాం. మేము మరో ఇద్దరు వికెట్ కీపర్‌లను ఎంచుకున్నాం. దక్షిణాఫ్రికాలో రాహుల్ మా కోసం అద్భుతంగా పనిచేసాడు. సిరీస్‌ని డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ పరిస్థితులలో ఐదు టెస్టు మ్యాచ్‌ల ఆడటం పరిగణనలోకి తీసుకుంటే.. మనకు ఉన్న మరో ఇద్దరు కీపర్ల మధ్య పోటీ నెలకోంది. ఒకరిని ఎంపిక చేస్తాం'అని ద్రవిడ్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి : India vs England: కోహ్లీ స్థానంలో కత్తిలాంటి కుర్రాడు.. బెస్ట్ ఫినిషర్ కే ఛాన్స్! కీపర్-బ్యాటర్ కావాలి.. అలాగే ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో వికెట్‌కీపర్-బ్యాటర్ పాత్ర కోసం భారత్ మొగ్గు చూపే అవకాశం ఉంది. భారత్‌లోని పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో బ్యాటింగ్ చేసే మంచి వికెట్‌కీపర్‌ను ఎంచుకోవడం తప్పనిసరి అయింది. ఈ సందర్భంలో ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజాలతోపాటు ఒక స్పెషలిస్ట్ స్టంపర్‌కు కేటాయించాల్సిన అవసరం ఉందని రాహుల్ ద్రవిడ్ అన్నారు. ముఖ్యంగా స్పిన్ కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితుల్లో టీమ్ మేనేజ్‌మెంట్ కూడా స్పెషలిస్ట్ వికెట్ కీపర్ ప్రాముఖ్యతకే విలువనిస్తుందన్నారు. ఇక ఈ సిరీస్‌లోని తొలి టెస్టు జనవరి 25 గురువారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. #england #rahul-dravid #kl-rahul #keeping మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి