KKR vs RCB : ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమి.. అచ్చిరాని కొత్త జెర్సీ.!

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచులో ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ గెలిచింది. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూసింది. జాక్స్, రజత్ పాటిదార్ చెరో అర్థసెంచరీ చేసిన లాభం లేకుండా పోయింది.

New Update
KKR vs RCB :  ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమి.. అచ్చిరాని కొత్త జెర్సీ.!

Kolkata Knight Riders : రాయల్ ఛాలెంజర్స్(RCB), కోల్ కతా నైట్ రైడర్స్(KKR) ఈడెన్ గార్డెన్ వేదికగా తలపడ్డాయి. ఈ ఉత్కంఠ పోరులో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. చివరి రెండు బంతులకు మూడు పరుగులు చేస్తే విజయం సాధించేంది. కానీ 19.5 బంతికి రన్ ఔట్ అయ్యింది. చివరి బంతికి రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించన ఫెర్గూసన్ కూడా పెవిలియన్ చేరాడు. ఫలితంగా ఒక్క పరుగు తేడాతో బెంగుళూరుపై కేకేఆర్ విజయం సాధించింది. జాక్స్, రజత్ పాటిదార్ హాఫ్ సెంచరీతో చెలరేగినప్పటికీ లాభం లేదు. ఇక ఆర్సీబీ కొత్త గ్రీన్ కలర్ జెర్సీ అచ్చిరాలేదనే చెప్పాలి.

తొలుత బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా బ్యాటర్లు మంచిశుభారంబాన్నిఇచ్చారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(Philip Salt) చెలరేగి ఆడాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో సంచలనం నమోదు చేశాడు. కేవలం 14 బంతుల్లోనే 48పరుగులు చేశాడు. ఈక్రమంలో 4.2ఓవర్ దగ్గర సిరాజ్ వేసిన బంతికి భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. దీంతో వేగవంతమైన అర్థం సెంచరీ సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ 10 పరుగులకే ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ విజయానికి ఒక్క పరుగు దూరంలో ఓడిపోయింది. విల్ జాక్స్, రజత్ పాటిదార్ శ్రమించిన ప్రయోజనంలేదు. ఓపెనర్లు కోహ్లీ,డుప్లెసిస్,ప్రభుదేశాయ్, గ్రీన్,మహిపాల్, నిరాశపరిచారు. ఆఖరులో దినేశ్ కార్తీక్, శర్మ మెరుపు ఇన్సింగ్స్ ఆడినా లక్ష్యం చేరుకోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో రసెల్ మూడు వికెట్లు పడగొట్టా..హర్షిత్ రాణా,సునీల్ నరైన్ చెరో రెండు, వరుణ్ చక్రవర్తి , స్టార్క్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ ఓటమితో ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్స్ లు మరింత సంక్లిష్టంగా మారాయి. ఏమైనా అద్రుష్టం కలిసి వస్తే తప్పా ఆ జట్టు నాకౌట్ చేరుకునే ఛాన్స్ లేదు.

ఇది కూడా చదవండి:  మంగళవారం హనుమాన్ జయంతి కాదు..హనుమాన్ విజయోత్సవం..ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు