Kishan Reddy : నీకు దమ్ముంటే ఆ పని చేయ్.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్! సీఎం రేవంత్, రాహుల్ గాంధీలపై బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఒకే అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. అబద్ధాలు చెప్పడమే కాంగ్రెస్ గ్యారంటీ. బీజేపీ- బీఆర్ఎస్ ఒకటే అనడానికి ఒక్క సాక్ష్యం చూపించు రేవంత్ రెడ్డి అంటూ సవాల్ విసిరారు. By srinivas 28 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TS News : తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్(Congress) అధిష్ఠానంపై బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) సంచలన కామెంట్స్ చేశారు. ఆదివారం హైదరాబాద్ బీజేపీ కార్యలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఏదో ఒకరకంగా అధికారంలోకి రావాలని చూస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కడ కాంగ్రెస్ కు సానుకూలత లేదని. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీ తోడో అని నాయకులు ఆ పార్టీ వీడారని చెప్పారు. కాంగ్రెస్ పాలనకు బీజేపీ పాలనతో పోలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, ఒక్క అవినీతి ఆరోపణ లేని ఏకైక ప్రధాని మోడీ అంటూ ప్రశంసలు కురిపించారు. తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు.. ఈ మేరకు మమ్మల్ని ఏ రంగంలో కూడా తప్పు పట్టే అవకాశం కాంగ్రెస్ కు లేకుండా పోయింది. దీంతో తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. రాహుల్, రేవంత్ కు అర్దరాత్రి కల వచ్చినట్లు బీజేపీ మానిఫెస్టో అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఒకే అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. బీజేపీ- బీఆర్ఎస్ ఒకటే అనడానికి ఒక్క సాక్ష్యం చూపించు రేవంత్ రెడ్డి. ఈ దశాబ్దంలోనే అతిపెద్ద అబద్ధం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నది. బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు. బిసి, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసిందే కాంగ్రెస్. ఎస్సీ వ్యక్తి కోవింద్, గిరిజన మహిళ ముర్మును రాష్ట్రపతి చేసింది బీజేపీ అన్నారు. ఇది కూడా చదవండి: Hardik: నువ్వేం **తున్నావు బ్రో.. తిలక్ నే అంటావా? పాండ్యాపై ముంబై ఫ్యాన్స్ ఫైర్! కాంగ్రెస్ కాళ్ళ కింద భూమి కదులుతుంది.. ఇక మూడోసారి మోడీ ప్రధాని కాబోతున్నారని, నిరాశ నిస్పృహలో కాంగ్రెస్ కాళ్ళ కింద భూమి కదులుతుందన్నారు. 27 మంది బీసీ మంత్రులు, 12 మంది ఎస్సీ మంత్రులు, 8 మంది గిరిజన మంత్రులు కేంద్రంలో పని చేస్తున్నారని చెప్పారు. అలాగే సిద్దిపేటలో అమిత్ షా చేసిన ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారని, కాంగ్రెస్ ఎంత దిగజారిందొ అర్దం చేసుకోవచ్చని చెప్పారు. అంబేడ్కర్ ఆశయలతోనే ప్రధాని మోడీ ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ప్రజల్లోకి వెళ్లి ఎం చెప్పాలో రేవంత్ కు అర్దం కాట్లేదు. అబద్ధాలు చెప్పడమే కాంగ్రెస్ గ్యారంటీ. ఒట్లు పెడితే ప్రజలకు న్యాయం జరగదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. తెలంగాణ ప్రజలు తొందరపడి మొన్న కాంగ్రెస్ కు ఓటు వేశామా అని ఆలోచిస్తున్నారు. రేవంత్ రెడ్డికి చేతనైతే హామీలు అమలు చేయాలి లేదంటే క్షమాపణ చెప్పాలి. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచన కాంగ్రెస్ కు ఉన్నట్టు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. #cm-revanth #rahul-gandhi #kishan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి