Hyderabad: పూజలందుకోవడానికి సిద్ధమైన ఖైరతాబాద్ సప్తముఖశక్తి గణేశుడు

హైదరాబాద్‌లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి పండగకు సిద్ధమయ్యాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈసారి 70 అడుగుల ఎత్తుతో వినాయకుడిని పూర్తిగా పర్యావరణహితంగా తయారు చేశారు. సప్తముఖశక్తి వినాయకుడిగా రేపటి నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నాడు.

New Update
Hyderabad: పూజలందుకోవడానికి సిద్ధమైన ఖైరతాబాద్ సప్తముఖశక్తి గణేశుడు

Sapta Mukha Sakthi Ganesh: రేపటి నుంచి వినాయకచవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాలు కూడా ఇందుకు సిద్ధమయ్యాయి. రెండు రాష్ట్రాలకు కలిపి ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ వినాయకుడు కూడా నవరాత్రుల పూజలందుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడు 70 అడుగుల ఎత్తులో కొలువుదీరుతున్నాడు ఖైర‌తాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇక‌, ఈఏడాది వినాయ‌కుడు సప్తముఖ మహాగణపతిగా పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. గురువారం మధ్యాహ్నం ప‌న్నెండు గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్‌.. ఖైర‌తాబాద్ స‌ప్త‌ముఖ గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. స‌ప్త‌ముఖ మహాగణపతి పూర్తి స్థాయిలో సిద్ధమై కళ్లను తీర్చిదిద్దడంతో ఉత్సవ కమిటీ మొద‌టిసారిగా ఆగమన్‌ కార్యక్రమాన్ని జ‌రిపించింది. ఈకార్య‌క్ర‌మంలో స్థానిక యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గర్నర్ కూడా పాల్గొంటారు. ఇక ఎప్పటలానే ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారని అంచనా వేస్తున్నారు.శ‌నివారం వినాయ‌క‌చ‌వితి రావ‌డంతో రెండురోజులు సెల‌వు వ‌చ్చింది. దీంతో భ‌క్తులు గ‌ణనాథుని ద‌ర్శ‌నానికి బారులు తీరే ఛాన్స్ ఉంద‌ని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముగ్గురు డీఎస్పీలు, 13 మంది ఇన్‌స్పెక్టర్లు, 33 మంది ఎస్‌ఐలతోపాటు 22 ప్లాటూన్ల సిబ్బంది కూడా ఉంటార‌ని సైఫాబాద్‌ ఏసీపీ ఆర్‌ సంజయ్‌ కుమార్ వివ‌రించారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దాంతో పాటూ ఈ ఖైరతాబాద్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు.

Also Read: PresVu Eye Drop: రీడింగ్ గ్లాసెస్‌కు బదులు ప్రెస్వూ ఐ డ్రాప్స్..నిజంగానే పని చేస్తున్నాయా?

Advertisment
Advertisment
తాజా కథనాలు