KCR: ఎన్నికల హామీలు కాంగ్రెస్ నెరవేర్చలేదు : కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్.. చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేరవేర్చలేదని ధ్వజమెత్తారు. By B Aravind 13 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి మాజీ సీఎం కేసీఆర్.. చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేరవేర్చలేదని ధ్వజమెత్తారు. అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిందని.. యాసంగి వచ్చినా పంటలకు బోనస్ ఇచ్చిందా అంటూ ప్రశ్నించారు. నాలుగు నెలలకే ఆ పార్టీ కుదేలైందని ఎద్దేవా చేశారు. ప్రజలను ప్రలోభ పెట్టి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదంటూ ధ్వజమెత్తారు. దళిత బంధు త్వరగా ఇవ్వకపోతే.. ఎంపిక చేసిన లబ్ధిదారులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. ప్రజలు మౌనంగా ఉంటే సమస్యలు పరిష్కారం కావని.. పోరాడి వాటిని సాధించుకోవాలంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు మంచి జరిగేలా తాను బతికున్నంతవరకు పోరాడుతూ ఉంటానని అన్నారు. Also Read: మేఘా కృష్ణారెడ్డికి షాక్.. సీబీఐ కేసు నమోదు ' మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పడు గ్రామాలు పట్టుకొమ్మలు కావాలని ఐదు పథకాలు తీసుకొచ్చి రైతులకు మేలు చేశాం. తొలిసారిగా మేమే రైతు బంధును అమలు చేశారు. 24 గంటల పాటు విద్యుత్ అందించాం. ప్రభుత్వమే రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసింది. 1.30 లక్షల మందికి మేము దళిత బంధు మంజూరు చేశాం. ఈ డబ్బులను ఇవ్వకుండా ప్రభుత్వం ఆపింది. దళితబంధు ఇవ్వకుంటే లబ్ధిదారులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోగానే రాష్ట్రంలో కరెంటు, సాగునీరు, తాగునీరు లేకుండా పోయాయి. ప్రజల తరఫున పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థుల్నే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలి. కాంగ్రెస్ హామీలు నెరవేరాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి. బలమైన ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడే ప్రభుత్వ హామీలు నెరవేరుతాయి. పదేళ్ల పాలనలో బీజేపీ దేశం కోసం ఏమైనా చేసిందా ?. దేశ ప్రజల్లో మత పిచ్చి లేపి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తోంది. మోదీ ప్రభుత్వం.. రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది. కాజీపేట రైల్నే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇంకా ఎందుకు ఇవ్వలేదు. తెలంగాణకు ఒక్క విద్యాసంస్థను కూడా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయ్యాలి. కేంద్ర సంస్థలతో పార్టీలను బెదిరించడమే ప్రధాని మోదీ చేసే పని. బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం.. రాష్ట్ర ప్రజల కోసం. కాంగ్రెల్ ఇచ్చిన 420 హమీలను ప్రజలు ఎక్కడిక్కడ నిలదీయాలి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు రాకుండా ఓడించాలని' కేసీఆర్ అన్నారు. Also Read: రేవంత్ రెడ్డిది రోజుకో డ్రామా: జగదీశ్ రెడ్డి ఇంటర్వ్యూ! #brs #kcr #telugu-news #congress #telnagana-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి