TELANGANA ELECTIONS:సమరానికి రెడీ అయిపోయిన బీఆర్ఎస్...రంగంలోకి కేసీఆర్

తెలంగాణలో అసెంబ్లీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో అన్ని పార్టీలు సమరానికి సై అంటున్నాయి. అందరికంటే ముందు బీఆర్ఎస్ ప్రచారంలోకి దిగిపోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. అక్టోబర్ 15 నుంచి 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.

New Update
TELANGANA ELECTIONS:సమరానికి రెడీ అయిపోయిన బీఆర్ఎస్...రంగంలోకి కేసీఆర్

తెలంగాణ అధికా పార్టీ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయిపోయింది. ప్రచారంతో ఓటర్లకు గేలం వేయడానికి అన్ని కసరత్తలు చేసేసుకుని రంగంలో దూకేస్తున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా సుడిగాలి పర్యటన చేయాలని డిసైడ్ అయిపోయిఆరు. రోజుకు రెండు, మూడు సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. అక్టోబర్ 15న హుస్నాబాద్ తో కేసీఆర్ ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు. 2018లో కూడా ఇక్కడ నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.

హూస్నాబాద్ లో భారీ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి హరీష్ రావ్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీని తర్వాత అక్టోబర్ 16న జనగామ, భువనగిరి సభలకు....17న సిరిసిల్ల, సద్ధిపేట సభల్లో పాల్గొంటారు. ఆ తర్వాతి రోజు 18న జడ్చర్ల, మేడ్చల్‌లో సభలు ఉంటాయి. దీని తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు కేసీఆర్. మళ్ళీ అక్టోబర్ 26నుంచి వరుసగా సభల్లో పాల్గొంటారు. 26న అచ్చంపేట, నాగర్ కర్నూల్, మునుగోడు...27న పాలేరు, స్టేషన్ ఘన్ పూర్, 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు...30న జుక్కల్,బాన్సువాడ, నారాయణ ఖేడ్, 31న హుజూరాబాద్, మిర్యాలగూడ, దేవరకొండల్లో సభలు ఉంటాయి.

ఇక నవంబర్ లో 1న సత్తుపల్లి, ఇల్లెందు...2న నిర్మల్, బాల్కొండ,ధర్మపురి...3న భైంసా, ఆర్మూర్, కోరుట్ల....5న కొత్తగూడెం, ఖమ్మం....6న గద్వాల్, మఖ్తల్, నారాయణ పేట...7న చెన్నూరు,మంథని, పెద్దపల్లి....8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిల్లో ప్రజలను కలుస్తారు.

నవంబర్ తొమ్మిన సీఎం కేసీఆర్ తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయనున్నారు. 9వ తేదీ ఉదయం సిద్ధిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత మధ్యాహ్నం 2గంటలకు గజ్వేల్‌లో మొదటి నామినేషన్ ను వేసి అక్కడ నుంచి కామారెడ్డి వెళ్ళి అక్కడ కూడా నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ వేసిన తర్వాత కామారెడ్డి భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడతారు.

Also Read:రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్…!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK VS LSG: ఎట్టకేలకు చైన్నైను వరించిన విజయం..దగ్గరుండి గెలిపించిన కెప్టెన్ మహీ

హమ్మయ్య పాయింట్ల పట్టికలో అట్టుగ ఉండి విజయం కోసం తపిస్తున్న జట్టును కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విజయతీరాలకు నడిపించాడు. చివర్లో వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మ్యాచ్ గెలిచేలా చేశాడు. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఎల్ఎస్జీ మీద గెలిచింది.

author-image
By Manogna alamuru
New Update
ipl

CSK VS LSG

గెలిచింది...గెలిచింది...చెన్నై సూపర్ కింగ్స్ మొత్తానికి మ్యాచ్ గెలిచింది.  పేలవమైన ప్రదర్శనతో అందరినీ నిరాశకు గురి చేస్తున్న సీఎస్క్ కు ఈరోజు మంచి విజయం దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ మీద 5 వికెట్ల తేడాతో చెన్నై గెలిచింది. వరుసగా ఐదు ఓటములను మూట గట్టకున్న సీఎస్కో ఎట్టకేలకు కాస్త ఊపిరి పీల్చుకుంది. స్వయంగా కెప్టెన్ ధోనీనే మ్యాచ్ ను గెలిపించడం ఈ మ్యాచ్ లో మరొక విషయం. ముందు బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాటర్లలో శివమ్‌ దూబె (43*), రచిన్‌ రవీంద్ర (37), షేక్‌ రషీద్‌ (27), ధోనీ (26*) రాణించారు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 2, అవేశ్‌ ఖాన్‌, మార్‌క్రమ్‌, దిగ్వేశ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగి..

ఈరోజు మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్దేశించిన 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లో 63 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన మార్క్‌రమ్, నికోలస్ పూరన్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఇద్దరూ ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలవలేకపోయారు. తొలి ఓవర్‌ ముగిసేసరికి లక్నో 1 వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. 

చెలరేగిన పంత్..

ఆ తర్వాత క్రీజ్‌లోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. అక్కడనుంచి మార్ష్, పూరన్ భారీ షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టారు. కానీ పూరన్ దూకుడు తక్కువ సమయానికే పరిమితం అయింది. నికోలస్ పూరన్ (8) పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో లఖ్‌నవూ రెండో వికెట్ కోల్పోయింది. అన్షుల్ కాంబోజ్ వేసిన నాలుగో ఓవర్‌లో చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్‌ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు.  దీంతో లక్నో జట్టు 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు సాధించింది. ఇక పంత్, మార్ష్‌ నిలకడగా ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. మార్ష్‌ (30) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో లక్నో జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు సాధించింది. ఆ తర్వాత పంత్ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. 49 బంతుల్లో 63 పరుగులు రాబట్టాడు. అలాగే బడోని 17 బంతుల్లో 22 పరుగులు, అబ్దుల్ సమద్ 11 బంతుల్లో 20 పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 166 పరుగులు రాబట్టారు.  
 

today-latest-news-in-telugu | IPL 2025 | csk-vs-lsg 

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

Advertisment
Advertisment
Advertisment