ప్రేక్షకుల హృదయాల్లో చంద్రమోహన్‌ది చెరగని ముద్ర.. కేసీఆర్, చిరంజీవితో పాటు ప్రముఖులు ఏమన్నారంటే?

చంద్రమోహన్ మృతిపట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో చంద్రమోహన్ చెరగని ముద్ర వేశారంటూ కేసీఆర్, చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళి అర్పిస్తున్నారు.

New Update
ప్రేక్షకుల హృదయాల్లో చంద్రమోహన్‌ది చెరగని ముద్ర.. కేసీఆర్, చిరంజీవితో పాటు ప్రముఖులు ఏమన్నారంటే?

చంద్రమోహన్ మృతిపట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. చంద్రమోహన్‌తో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ నివాళి అర్పిస్తున్నారు. నటనా నైపుణ్యంతో తెలుగు ప్రజ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌కి తీర‌ని లోటు అంటూ ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు.

‘ప్రముఖ తెలుగు సినీనటుడు చంద్రమోహన్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించా. నాటి చిత్రాలు మొదలుకొని నిన్న మొన్నటి సినిమాల వరకూ నటుడిగా వారి ప్రాధాన్యత ఎనలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

‘ప్రముఖ సినీ నటుడు, తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు శ్రీ చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి స్ఫూర్తితో ఎందరో నటీ నటులు ఉన్నత స్థాయికి ఎదిగారని, కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని చంద్రమోహన్ సొంతం చేసుకున్నారని సీఎం తెలిపారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు సీఎం శ్రీ కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

‘ప్రముఖ న‌టుడు చంద్రమోహ‌న్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూయ‌డం బాధాక‌రం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయ‌న తెలుగు, త‌మిళ భాషల్లో వంద‌లాది సినిమాల్లో న‌టించి తెలుగు ప్రజ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఆయన కుటుంబ స‌భ్యుల‌కు నా ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తూ, ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా’ - ఏపీ సీఎం జగన్‌

Also read : చంద్రమోహన్ అంత్యక్రియలు మరింత ఆలస్యం.. కారణమిదే?

‘సీనియ‌ర్ న‌టుడు చంద్రమోహ‌న్ మృతి బాధాక‌రం. హీరో, కమెడియ‌న్‌, సహాయ నటుడిగా విభిన్న పాత్రలు అల‌వోక‌గా పోషించిన ఆయన మరణం తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌కి తీర‌ని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాను’ - నారా లోకేశ్‌

‘‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్లాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలంతో తెలుగువారి మనసులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటుడు, కథానాయకుడు చంద్రమోహన్ గారు ఇక లేరన్న వార్త ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ - చిరంజీవి

‘పదహారేళ్ళ వయసు నుంచి మా స్నేహం మొదలైంది. నాకు మంచి మిత్రుడు, మంచి మనిషి అయినా చంద్ర మోహన్‌గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ - దర్శకుడు కే రాఘవేంద్ర రావు

‘ఎన్నో దశాబ్దాలుగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్‌‌గారి అకాల మరణం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ - జూనియర్ ఎన్టీఆర్‌

‘విలక్షణ నటుడు చంద్రమోహన్ అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు. ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ - కల్యాణ్‌ రామ్‌

‘స్థాయిని బట్టి కాకుండా మనిషిని మనిషిగా ప్రేమించిన వ్యక్తి చంద్రమోహన్. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి హుందాగా ఉంటూ చిత్ర పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. చంద్రమోహన్‌గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ - పోసాని కృష్ణమురళి, ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌

‘ఆయన మోము మనకు అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తుచేస్తుంది. ఆయన చిరస్మరణీయమైన నటన, అద్భుతమైన పాత్రలతో ప్రతిసారీ మన పెదవులపై చిరునవ్వు విరుస్తుంది’ - సాయి ధరమ్‌ తేజ్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు