Karnataka : ఐటీ ఉద్యోగులకు షాక్.. రోజుకు 14 గంటలు పని ! కర్ణాటకలో ఐటీ సంస్థలు.. ఉద్యోగుల పనివేళలు 14 గంటలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఐటీ ఉద్యోగులు దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇలాచేస్తే తమకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వాపోతున్నారు. By B Aravind 21 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Shock To IT Employees : కర్ణాటక (Karnataka) లో ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చాయి. ఉద్యోగుల పనివేళలు 14 గంటలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఐటీ ఉద్యోగులు (IT Employees) దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇది దారుణమని.. ఆరోగ్య సమస్యలు వస్తాయని, లేఆఫ్‌ల ఆందోళన ఉంటుందని వాపోతున్నారు. Also read: రోడ్డుపై ఓవర్‌టేక్ చేసేందుకు దారి ఇవ్వలేదని మహిళపై దాడి.. ఇక వివరాల్లోకి వెళ్తే కర్ణాటక సర్కార్.. కర్ణాట షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1961ను సవరించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐటీ కంపెనీలు తమ ప్రతిపాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇందుకోసం ఉద్యోగుల పనివేళలను 14 గంటలు పెంచాలని అభ్యర్థిస్తున్నాయి. ప్రస్తుతం కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగులకు 12 (10 గంటలు + 2 గంటల ఓవర్ టైమ్) గంటల వరకు పనిచేసే పర్మిషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఐటీ/ఐటీఈఎస్/బీపీఓ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 12 గంటల కన్నా ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉందని.. ఐటీ సంస్థలు తమ ప్రతిపాదనలో తెలిపాయి. అయితే ఈ దీనిపై కర్ణాటక ప్రభుత్వం ప్రాథమిక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐటీ సంస్థల (IT Companies) ప్రతిపాదనలను కేబినేట్‌లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈ నిర్ణయాన్ని ఐటీ ఉద్యోగులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. Also Read: భారత్ లో కరోనా మరణాలు ప్రభుత్వం చెప్పినదానికన్నా ఎక్కువట.. షాకింగ్ రిపోర్ట్! #telugu-news #national-news #it-employees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి