USA: డెమోక్రటిక్ అభ్యర్ధిగా కమలా హారిస్ ఖరారు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధికి కమలా హారిస్‌ను కన్ఫామ్ చేశారు. పార్టీ తరుఫున అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు కావాల్సిన ప్రతినిధుల మద్దతును ఆమె పొందారు .

New Update
Kamala Harris: 85 నిమిషాల పాటు దేశాధ్య‌క్షురాలిగా కమలా హ్యారిస్‌!

Kamala Harris: ఎట్టకేలకు డెమోక్రటిక్ అభ్యర్ధిగా కమలా హారిస్ ఖరారయ్యారు. ఇండియన్ ఆరిజీన్ కమలా ట్రంప్ కు పోటీగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలవనున్నారు. నవంబర్ 7న అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ అభ్యర్థిత్వం కోసం కావాల్సిన ప్రతినిధుల ఓట్లను వర్చ్‌వల్‌ రోల్‌ కాల్‌లో కమలా సాధించారని డెమోక్రటిక్‌ నేషనల్‌ కమిటీ ఛైర్‌ జేమ్‌ హరిసన్‌ ప్రకటించారు. ఇప్పుడు దీని తర్వాత అమెరికా అధయక్ష ఎన్నిక నామినీగా కమలా హారిస్ పేరును ప్రకటించనున్నారు. అయితే ఇంకా డిలిగేట్‌ల ఓట్ల ప్రక్రియ కొనగుతోంది. ఇది సోమవారం వరకు ఉంటుంది. కానీ కమలా హారిస్‌కు ఇప్పటికే మెజారిటీ ఓట్లు వచ్చేశాయని జేమ్ హారిసన్ తెలిపారు.

ఈ మొత్తం ప్రక్రియ అయిన తర్వాత కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మరోవైపు మరోవైపు తన ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్‌ ఇంతవరకుసెలెక్ట్ చేసుకోలేదు. ఈ వీకెండ్‌లోపు ఆమె నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

Also Read: Kerala: వాయనాడ్‌లో 49 మంది చిన్నారులు గల్లంతు

Advertisment
Advertisment
తాజా కథనాలు