Kaleshwaram Project: కాళేశ్వరంలో 'మేఘా' అవినీతి రూ.50 వేల కోట్లు.. కాగ్ నివేదికలో సంచలన లెక్కలు!

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ లెక్కలను పరిశీలిస్తే 'మేఘా' సంస్థ అవినీతిపై షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం రూ.50 వేల కోట్లకు పైగా ప్రజల సొమ్మును ఆ కంపెనీ కాళేశ్వరం పేరిట దోచుకుందన్న ఆరోపణలు నిజమని కాగ్ నివేదికను పరిశీలిస్తే స్పష్టం అవుతోంది.

New Update
Kaleshwaram Project: కాళేశ్వరంలో 'మేఘా' అవినీతి రూ.50 వేల కోట్లు.. కాగ్ నివేదికలో సంచలన లెక్కలు!

కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు బీఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఒక్క ప్రాజెక్టులోనే ప్రభుత్వ సహకారంతో మేఘా కృష్ణారెడ్డి వేల కోట్ల ప్రజాసొమ్మును దోచుకున్నాడన్న ఆరోపణలు ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే  తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదిక ఆ ఆరోపణలను నిజం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) వేల కోట్ల అవినీతి సొమ్మును తన జేబులో వేసుకుందని స్పష్టం చేసింది.

కాగ్ తెలిపిన నివేదిక ప్రకారం.. మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీకి.. పంపులు, మోటార్లు, ఇతర పరికరాల కోసం కేవలం నాలుగు ప్యాకేజీల్లోనే ఏకంగా రూ.5,188 కోట్లు అదనంగా ముట్టాయని తెలిపింది. అయితే మిగతా 17 ప్యాకేజీల్లో కూడా పనులు జరిగినందువల్ల ఈ అవినీతి సొమ్ము మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. 2022లో 17 ప్యాకెజీల్లోని నాలుగు ప్యాకేజీల్లో పనులు జరుగుతుండగా.. ఆడిటింగ్‌ ఏజెన్సీకి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 13 ప్యాకెజీలకు బిల్లులు కూడా అందించలేదని చెప్పింది.

Also Read: రోడ్డుపై దరఖాస్తులు..బీ కేర్ ఫుల్‌.. కేటీఆర్ వార్నింగ్‌

మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ సీఎం కేసీఆర్‌ ఏటీయంలా మారిందంటూ పదే పదే విమర్శలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విమర్శలకు మరింత బలాన్ని చేకూరుస్తూ.. కాగ్ సంచలన ఆరోపణలు చేసింది. మెఘా ఇంజనీరింగ్, ఎల్‌ & టీ, నవయుగ కంపెనీలకు కనీసం రూ.7500 కోట్ల అదనపు ముడుపులు అందాయని చెప్పింది. ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిన నేపథ్యంలో.. రోడ్డు నిర్మాణంలో భాగంగా ఎల్‌ అండ్‌ టీ కంపెనీకి అదనంగా రూ.66.29 కోట్లు అందినట్లు పేర్కొంది. నీటిని తొలగించే ప్రక్రియ కోసం రూ.29 కోట్లు అలాగే అదనపు సామగ్రి కోసం రూ.26.46 కోట్లు ప్రభుత్వం చెల్లించినట్లు తెలిపింది. కాళేశ్వరం అవినీతిలో మేఘా పాత్ర అత్యంత ఎక్కువ అని ఈ లెక్కలను పరిశీలిస్తే స్పష్టం అవుతోంది.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చయ్యాయని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కాగ్‌ మాత్రం ఈ ప్రాజెక్టు కోసం రూ.1.5 లక్షల కోట్లు దాటి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో కాంట్రాక్టర్లకే అదనపు ముడుపులు ముట్టాయని నిర్ధారించింది. 2008లో అప్పటి ప్రభుత్వం పంపులు, మోటార్లు, పరికరాల ఆధారంగా ఖర్చును అంచనావేస్తే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం నీటిపారుదల శాఖ సలహాదారులు, ఆ శాఖ నుంచి వివరాలు సేకరించి ఖర్చులను సిద్ధం చేసినట్లు కాగ్ తెలిపింది. దీనివల్ల పరికారల కోసం రూ.7,214 కోట్లు అంచనా వేస్తే.. కాంట్రాక్టర్లు మాత్రం బీహెచ్‌ఈఎల్ కంపెనీకి కేవలం రూ.1,686 కోట్లు మాత్రమే చెల్లించారని పేర్కొంది. దీంతో కాంట్రాక్టర్లకు రూ. 5,188 కోట్ల అదనపు సొమ్ము ముట్టిందని తెలిపింది.

Also Read: మేడిగడ్డపై విచారణ.. హైకోర్టు సీజేకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

ప్యాకెజీ 18లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టన్నెల్‌ పొడవును, అందుకు సంబంధించిన పనులను తగ్గించినప్పటికీ వీటికి సంబంధించిన ఖర్చులను మాత్రం తగ్గించలేదు. దీనివల్ల కాంట్రక్టర్లకు రూ.94.32 కోట్ల సొమ్ము ముట్టింది. అలాగే ప్యాకేజీ 17లో కూడా అదనంగా వారు రూ.50 కోట్లు దండుకున్నారు. ప్యాకేజీ 9లో చూసుకుంటే రూ.48 కోట్లు అదనంగా దోచుకున్నారు. ఇక ప్యాకెజీ 21A లో పైప్‌లైన్‌ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రదేశాల్లో మట్టిని తవ్వి, పారవేసేందుకు కాంట్రాక్టర్లకు రూ.21 కోట్లు ఇచ్చారు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ఆ పైప్ చాలా చిన్నదని.. మట్టిని తవ్వి పారవేసే అవసరమే లేదని కాగ్ తేల్చి చెప్పింది.

ప్యాకెజీ 16లో 89 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాలనుకున్న కెనాల్‌ను 57 కిలోమీటర్లకు తగ్గించారు. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం 89 కిలోమీటర్ల కోసం డబ్బులు చెల్లించడంతో కాంట్రక్టర్లకు అదనంగా రూ.117 కోట్లు ముట్టాయి. ప్యాకేజీ 12లోని లింక్‌ 4లో టన్నెల్‌ నిర్మాణం కోసం 182 మెట్రిక్ టన్నుల స్టీల్‌ అవసరం అవుతుంది. కానీ 13,048 మెట్రిక్ టన్నులుగా అంచనా వేసి ప్రభుత్వం వాటికి  డబ్బులు చెల్లించడంతో కాంట్రక్టర్లు రూ.64.98 కోట్లు దండుకున్నారు. ఇక ప్యాకేజీ 15లో అదనంగా రూ.58 కోట్లు కాంట్రక్టర్లకు ముట్టినట్లు కాగ్‌ వివరించింది. మొత్తంగా చూస్తే సుమారు రూ.50 వేల కోట్లకు పైగా ప్రజాసొమ్ము ఈ ప్రాజెక్టు పేరుతో మేఘా ఇంజనీరింగ్ కంపెనీ పాలైందని కాగ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

Also read: సంక్రాంతి పండక్కి మరో 6 ప్రత్యేక రైళ్లు.. రూట్ల వివరాలు ఇవే..

Advertisment
Advertisment
తాజా కథనాలు