Mlc Kavitha : మీరు హిందువులకు, హిందీకి వ్యతిరేకం కాదని నిరూపించుకోండి రాహుల్: కవిత! కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇప్పటికైనా హిందువులకు, హిందీ మాట్లాడేవారికి వ్యతిరేకం కాదని నిరూపించుకోవాలని బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపైన ఇప్పటికైనా ఆయన స్పందించాలన్నారు. By Bhavana 25 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha Fire On Rahul Gandhi : కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పై బీఆర్‌ఎస్(BRS) నాయకురాలు కవిత(Kavitha) మరోసారి విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా మీరు హిందువులకు(Hindus) , హిందీ(Hindi) మాట్లాడేవారికి వ్యతిరేకి కాదని నిరూపించుకోండి అంటూ సూచించారు. ఇప్పటికే సనాతన ధర్మం పై డీఎంకే నేత ఉదయ నిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యల గురించి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. ఇప్పటికైన వాటి గురించి రాహుల్ స్పందించాల్సి ఉందని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే '' హిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయిలెట్లను శుభ్రం చేస్తారు'' అని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ (Dayanidhi Maran)చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైనా రాహుల్ గాంధీ తన వైఖరిని ఇప్పటికైనా స్పష్టం చేయాలని కవిత అన్నారు. హిందువులపై , హిందీ భాష పై దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్న డీఎంకే పార్టీ నాయకులు విషయంలో ఇప్పటికైనా రాహుల్ మౌనం వీడాలని ఆమె అన్నారు. డీఎంకే పార్టీ అనేది ఇండియా కూటమిలో భాగమైనందున దాని నాయకుల వ్యవహారాల శైలి పై కాంగ్రెస్ ఏమనుకుంటుందో యావత్ దేశానికి చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ పై ఉందని కవిత అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను చూస్తుంటే..అది పీఆర్ స్టంట్‌లాగా కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రలో దేశాన్ని ఏకం చేసే మాటలు మాట్లాడుతున్న రాహుల్..ఆ కూటమిలోని పార్టీల నేతలు హిందువుల గురించి, హిందీ భాష పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే..రాహుల్ ఎందుకు చూస్తూ ఉంటున్నారని కవిత ఎద్దేవా చేశారు. కొద్ది రోజుల క్రితం డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు..ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పై వ్యాఖ్యలు చేసి హిందువుల మనో భావాలను దెబ్బతీశారని ..వాటి గురించి మాట్లాడాల్సిన బాధ్యత రాహుల్ పై ఉందన్నారు. హిందువులకు, హిందీ భాష మాట్లాడే వాళ్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదనే విషయాన్ని చాటిచెప్పేందుకైనా రాహుల్ స్పందించాలన్నారు. Also read: 29న మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పీపీటీ! #brs #congress #rahul-gandhi #kavitha #hindhus #hindhi #santhanadharma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి