Movies : కాంతారాలో జూనియర్.. కన్నడలో వైరల్ అవుతున్న న్యూస్

తెలుగు, కన్నడ ప్రేక్షకులకు జూ.ఎన్టీయార్ సర్‌ప్రేజ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడా అంటే అవుననే వినిపిస్తోంది. కన్నడ బాక్సాఫీస్ హిట్, రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతారా మూవీలో తారక్ నటించడానికి రెడీ అయ్యాడుట. దీనికి సంబంధించిన వార్త కన్నడ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది.

New Update
Movies : కాంతారాలో జూనియర్.. కన్నడలో వైరల్ అవుతున్న న్యూస్

Kantara : ఈ మధ్య కాలంలో కన్నడ మూవీలు(Kannada Movies) బాగా హిట్ అవుతున్నాయి. మలయాళం తర్వాత తెలుగులోకి ఎక్కువగా డబ్ అవుతున్న సినిమాలు కన్నడవే. కాంతారా(Kantara) సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఇది మరింత ఎక్కువైపోయింది. ఇప్పుడు కాంతారా సినిమాకు ప్రీక్వెల్ తీస్తున్నాడు హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty). దీని కోసం కన్నడ, తెలుగు ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు చూడని జానర్‌, కొత్త విషయంతో తీసిన సినిమా కావడంతో కాంతారాను కన్నడ, తెలుగు ప్రేక్షకులు థ్రిల్ అయిపోయారు. ప్రస్తుతం వస్తున్న ప్రీక్వెల్ మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు కొంతకాలం క్రితం విడుదల చేసిన కాంతారా-2 ఫస్ట్‌లుక్ కూడా సూపర్ హిట్ అయింది. ఇందులో రిషబ్ శెట్టి లుక్‌ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్ గురించి మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. కన్నడ ఇండస్ట్రీ(Kannada Industry) లో దీని గురించి టాక్ విపరీతంగా వైరల్ అవుతోంది. అదే కాంతారా ప్రీక్వెల్‌లో జూ.ఎన్టీయార్(Jr. NTR) నటిస్తున్నాడు అని. ఈ మధ్య కాలంలో ప్రశాంత్ నీల్ ఇంట్లో ఒక ఫంక్షన్‌కు తారక్, రిషబ్ శెట్టి ఇద్దరూ హాజరయ్యారు. అక్కడ ఇద్దరూ కలిసి ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారని... జూ.ఎన్టీయార్ కాంతారా-2(Kantara-2) లో నటించడానికి ఒప్పుకున్నాడని చెబుతున్నారు. ఈ మూవీలోని ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు గాని.. కన్నడ మీడియా, ఇండస్ట్రీలో ఈ న్యూస్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు అయితే.. ఈ వార్త నిజమైతే బాగుండు అని ఆశ పడుతున్నారు. అసలే కాంతారాకు తెలుగు ప్రేక్షకులు పెద్ద ఫ్యాన్స్...అలాంటి దానిలో ఎన్టీయార్ నటిస్తే ఇక తిరుగు చూసుకోనక్కర్లేదని అంటున్నారు.

20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతారా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 400 కోట్లకు వరకు కలెక్షన్స్ ని రాబట్టింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారాను సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకుని..కాంతారా ప్రీక్వెల్‌ను మేకర్స్ భారీగా తెరకెక్కిస్తున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీయార్ సినిమా ఇప్పటి వరకు విడుదల అవ్వలేదు. కానీ తారక్ వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నాడు. ఇది ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయనున్నారు. దీంతో పాటూ వార్ 2, బాలీవుడ్ స్పై యూనివర్స్ లో ఓ ప్రాజెక్ట్‌తో పాటు NTR31 సినిమాలు కూడా వరుసపెట్టి చేయడానికి రెడీ అయ్యాడు తారక్.

Also Read : Telangana : తెలంగాణ విద్యుత్ మండలిలో ఉద్యోగాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు