Jr. NTR: కుటుంబంతో కలిసి జపాన్ వెళ్లిన జూనియర్‌ ఎన్టీఆర్‌..ఎందుకంటే!

కొత్త సంవత్సరం రాబోతున్న తరుణంలో తెలుగు సినిమా హీరోలందరూ తమ కుటుంబాలతో కలిసి విదేశాలకు చెక్కేస్తున్నారు. నిన్నటికి నిన్న మహేశ్‌ బాబు తన కుటుంబంతో కలిసి విదేశాలకు పయనమైతే..తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ తన భార్య పిల్లలతో కలిసి జపాన్‌ ట్రిప్‌ కి వెళ్లాడు.

New Update
Jr. NTR: కుటుంబంతో కలిసి జపాన్ వెళ్లిన జూనియర్‌ ఎన్టీఆర్‌..ఎందుకంటే!

నందమూరి తారక రామరావు (NTR) ...సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కుటుంబంతో కూడా ఎక్కువ సమయం గడపడానికే చూసుకుంటాడు. తారక్‌ ప్రస్తుతం దేవర (Devara) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఏ మాత్రం ఖాళీ దొరికిన చాలు కుటుంబంతో ఎక్కడో చోటకి ట్రిప్‌ వేసేస్తుంటాడు.

కొత్త సంవత్సరం రాబోతున్న తరుణంలో కుటుంబంతో కలిసి జూనియర్‌ ఎన్టీఆర్‌ వెకేషన్‌ కి వెళ్లిపోయాడు. అది ఎక్కడికో తెలుసా..జపాన్‌ కి. తారక్‌ తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారుతున్నాయి. తారక్‌ తన భార్య ప్రణతి, కుమారులు అభయ్‌, భార్గవ్‌ లతో కలిసి ఎయిర్‌ పోర్టులో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్‌ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో ఆలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. బాలీవుడ్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ గా నటిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా రెండు భాగలుగా తెరకెక్కుతుంది. దేవర మొదటి పార్ట్‌ పాన్‌ ఇండియా మూవీగా 2024 ఏప్రిల్‌ 5న థియేటర్లలోకి రానుంది. మరోవైపు తారక్‌ సెట్స్‌లో డ్యాన్సర్లతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఇప్పటికే నెట్టింట వైరల్ అన్నాయి. మ‌ల్టీ లింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. కేవలం ఎన్టీఆర్‌ మాత్రమే కాకుండా..సూపర్‌ స్టార్‌ మహేశ్‌ కూడా ఇప్పటికే కుటుంబంతో కలిసి విదేశాలకు పయనమయ్యాడు. కొత్త సంవత్సరం వేడుకలను కుటుంబంతో కలిసి ఫారిన్‌ లో జరుపుకునేందుకు మహేశ్‌ ప్లాన్‌ చేశాడు. మహేశ్‌ తాజాగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం.

ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్నారు.

Also read: ఒక్క ఎగ్ రూ.32.. పాకిస్థాన్ లో దారుణ పరిస్థితులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మహేష్ చేతిలో దర్శనమిచ్చిన పాస్‌పోర్టు.. వెకేషన్‌కు పర్మిషన్ ఇచ్చిన రాజమౌళి

SSMB29 మూవీ షూటింగ్ కోసం మహేష్ పాస్‌పోర్టును రాజమౌళి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పాస్‌పోర్టును రాజమౌళి తిరిగి ఇచ్చేశాడని మహేష్ ఎయిర్‌పోర్టులో చూపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫైనల్‌గా వెకేషన్‌కు రాజమౌళి పర్మిషన్ ఇచ్చాడని అంటున్నారు.

New Update
Mahesh passport video

Mahesh passport video Photograph: (Mahesh passport video)

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగజం రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 మూవీ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. షూటింగ్ కోసం రాజమౌళి మూడు నెలల క్రితం పాస్‌పోర్టు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళి ఇప్పుడు మహేష్‌కి పాస్‌పోర్టు ఇచ్చారు. ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్తున్న మహేష్ పాస్‌పోర్టును ఫొటోగ్రాఫర్లకు ఎయిర్‌పోర్టులో చూపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్ని రోజులకు రాజమౌళి మహేష్‌కు ఫ్రీడమ్ ఇచ్చారని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!

ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!

ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్‌ అరెస్టు

ఇది కూడా చూడండి: Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?

Advertisment
Advertisment
Advertisment