America Iran War : కమ్మేస్తోన్న యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై దాడి చేయాలని బైడెన్‌పై పెరుగుతోన్న ఒత్తిడి! ఇటీవల జోర్డాన్‌లో యుఎస్ దళాలపై డ్రోన్ దాడి చేసి ముగ్గురు సైనికులను చంపినందుకు ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులపై ప్రతీకార దాడులకు దిగడానికి అమెరికా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్‌పై నేరుగా ప్రతీకార చర్యలకు దిగాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. By Trinath 30 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి America vs Iran : అక్టోబర్‌లో ఇజ్రాయెల్-హమాస్(Israel-Hamas) యుద్ధం చెలరేగినప్పటి నుంచి మధ్యప్రాచ్యంలోని అమెరికన్(American) దళాలపై ఇరాక్, సిరియా, జోర్డాన్, యెమెన్ దేశాల్లో ఇరాన్ మద్దతు దళాలు 150 కంటే ఎక్కువ సార్లు దాడి చేశాయి. ఇక తాజాగా జోర్డాన్(Jordan) లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ ఆదివారం దాడి చేసి ముగ్గురు సైనికులను హతమార్చింది. 40 మందికి పైగా సైనికులు గాయపడ్డారు. ఈ దాడిలో మరణించిన అతి పిన్న వయస్కుడైన సైనికుడి వయస్సు 23. టవర్-22 బేస్ వద్ద ఉన్న దాదాపు 350 మంది సైనికులు డ్రోన్‌ను ఎందుకు ఆపలేకపోయారో తెలుసుకోవడానికి అమెరికా అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇరాన్ చర్యపై అమెరికా రగిలిపోతున్నారని సమాచారం. ఇరాన్‌పై నేరుగా ప్రతీకార చర్యలకు దిగాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్(Biden) పై ఒత్తిడి పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. టవర్-22 బేస్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు: ఇరాన్(Iran) పై దాడికి ఓవైపు బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతుందని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు వైట్‌హౌస్ ఈ ప్రచారానికి పూర్తి భిన్నంగా స్పందించింది. జోర్డాన్‌లో అమెరికన్ సైనికులపై దాడి తరువాత, ఇరాన్‌తో లేదా ఈ ప్రాంతంలో అమెరికా విస్తృతమైన యుద్ధాన్ని కోరుకోవడం లేదని వైట్ హౌస్ సోమవారం తెలిపింది. దక్షిణ కరోలినాలో మాట్లాడిన బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో గత రాత్రి తమకు చాలా కష్టమైందన్నారు. ముగ్గురు వీర సైనికులను కోల్పోయామని చెప్పారు. అటు జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించడంపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ దాడిలో టెహ్రాన్ పాత్ర లేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వివాదాస్పద వర్గాలు వారి ప్రాధాన్యతల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. ఇరాన్ మద్దతుదారుల్లో పెరుగుతోన్న భయం: మరోవైపు తూర్పు సిరియాలో ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు తమ స్థావరాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. అమెరికా తమపై వైమానిక దాడులు చేస్తుందని భయపడుతున్నారు. ఈ ప్రాంతాలు మయాదీన్, బౌకమల్లకు కంచుకోటలు. అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు అమెరికా సైన్యంపై దాడులు పెంచాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఈ గ్రూపులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ గ్రూప్స్ అమెరికన్ సైనికులపై 150 కంటే ఎక్కువ దాడులు చేసింది. ఇరాక్‌లో ఉన్న అమెరికన్ సైనికులపై అక్టోబర్ 18న మొదటి అతిపెద్ద దాడి జరిగింది. అప్పటినుంచి నిరంతర దాడులు కొనసాగుతుండగా.. మొన్న ఆదివారం ముగ్గురు అమెరికన్ సైనికులు ప్రాణం తీసేవరకు వచ్చింది. Also Read: మహాత్మా గాంధీ హత్య గురించి తెలుసుకోవలసిన విషయాలు! WATCH: #biden #hamas-israel-war #america-vs-iran #jordan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి