Joint Pain: ఈ చిట్కాతో కీళ్ల నొప్పిలు తగ్గించుకోవచ్చు..అదేంటో తెలుసుకోండి!

ప్రస్తుత కాలంలో చాలామంది కీళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. పెయిన్ కిల్లర్ల‌ను వేసుకునే బదులు కొన్ని ఇంటి చిట్కాను పాటిస్తే ఈ కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. నువ్వుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది ఎముకల‌ను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

New Update
Joint Pain: ఈ చిట్కాతో కీళ్ల నొప్పిలు తగ్గించుకోవచ్చు..అదేంటో తెలుసుకోండి!

Joint Pain: ప్రస్తుత కాలంలో కీళ్ల, మోకాళ్ల నొప్పులు, న‌డుమునొప్పితో ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. పూర్వకాలంలో వ‌య‌సు పైబ‌డిన వారిలోనే క‌నిపించే ఈ కీళ్ల నొప్పులు ప్రస్తుతం యువ‌తలో ఎక్కువగా క‌నిపిస్తున్నాయి. మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న‌శైలిలో మార్పులు, పోష‌కాహార లోపం వంటి వివిధ ర‌కాల కార‌ణాలతో కీళ్లనొప్పుల స‌మ‌స్య వస్తుంది. అయితే.. చ‌లికాలంలో ఈ స‌మ‌స్య మరీ ఎక్కువై కీళ్ల నొప్పులు మ‌రింత తీవ్రత‌రం అవుతుంది. ఈ స‌మ‌స్య నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్‌ల‌ను వేసుకుంటారు. అయితే.. మెడిసిన్‌ వేసుకుంటే స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం అయినప్పటికి వీటిని దీర్ఘకాలం వాడితే మాత్రం ఎక్కవ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఈ పండ్లను తింటే రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు!

ఇలాంటి పెయిన్ కిల్లర్‌ల్‌ను వేసుకునే బదులు కొన్ని ఇంటి చిట్కాను పాటిస్తే ఈ కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటే ఖచ్చితంగా డాక్టర్లను సంప్రదించ‌డం మంచిది. అయితే.. కీళ్ల నొప్పుల స‌మ‌స్య త‌క్కువ‌గా ఉన్నా లేదా ప్రారంభ ద‌శ‌లో ఉన్నా ఈ చిట్కాను పాటిస్తే కీళ్ల నొప్పుల స‌మ‌స్య త‌గ్గడంతో పాటు కీళ్ల మ‌ధ్య గుజ్జు ఎక్కువ‌గా పెరుగుతుంది. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: గొంతులో ఆహారం ఇరుక్కుంటే యమ డేంజర్.. అప్పుడు ఇలా చేయండి!

ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా తేనెను, నువ్వులు, శొంఠి పొడిని కలుపుకోవాలి.త‌రువాత దీనిని 10 నిమిషాల పాటు ప‌క్కకు ఉంచిన త‌రువాత తినాలి. ఇలా క్రమం త‌ప్పకుండా 15 నుంచి 20 రోజుల పాటు తింటే క్రమంగా కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. అంతేకాదు.. కీళ్లల్లో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. నువ్వుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది ఎముకల‌ను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ విధంగా ఈ టిప్స్‌ను ఫాలో అయితే కీళ్ల నొప్పులు, న‌డుము నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య త‌గ్గి ఎముక‌లు ధృడంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు