Breaking : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల!

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది APPSC. మొత్తం 81 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసింది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులకు అవకాశం ఇవ్వనుంది. మార్చి 17న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.

New Update
Breaking : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల!

APPSC Group-1 Notification : ఉద్యోగార్ధులకు వరుస పెట్టి గుడ్‌న్యూస్‌లు చెబుతోంది ఏపీ సర్కార్‌. నిన్న గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ రిలీజ్ చేయగా.. ఇవాళ తాజాగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అవును..! ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది APPSC. మొత్తం 81 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసింది.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొత్తం 81 ఖాలీలను APPSC భర్తీ చేయనుంది. ప్రభుత్వంలోని వివిధ పరిపాలనా పొజిషన్స్‌ను ఇవి కవర్ చేస్తాయి. అభ్యర్థులు ఈ పోస్టుల కోసం జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. గ్రూప్-1 పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష మార్చి 17న జరగనుంది. అందుబాటులో ఉన్న స్థానాల్లో, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో, సమర్థవంతమైన పాలనను నిర్ధారించడంలో కీలకమైన డిప్యూటీ కలెక్టర్ పాత్ర కోసం 9 ఖాళీలు ,డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) 26 ఖాళీలు ఉన్నాయి.

నిన్న గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల:

WATCH:

ఏపీ(AP) యువత, విద్యార్థులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేష‌న్ ఎట్టకేలకు నిన్న విడుదలైంది. పోటీ పరీక్షల కోసం చాలాకాలంగా సాధన చేస్తున్న అభ్యర్థులకు జగన్‌ ప్రభుత్వ ఈ నిర్ణయం ఉత్సాహాన్నిచ్చింది. ముందుగా చెప్పినట్టుగానే పెద్దసంఖ్యలో గ్రూప్‌ 2 (Group 2) ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ (APPSC) నుంచి నోటిఫికేషన్‌ వెలువడింది. మొత్తం 897 పోస్టుల‌తో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏపీపీఎస్సీ ప్రకటించిన మొత్తం 897 పోస్టుల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, మిగతా 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు డిసెంబ‌ర్ 21 నుంచి జ‌న‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నియామకాలను వేగవంతంగా పూర్తిచేస్తామని ముందునుంచి చెప్తున్నట్టుగానే, పరీక్షల తేదీలను కూడా నోటిఫికేషన్‌లోనే ప్రకటించారు.

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండు దశల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హులు. పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

Also Read: ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దు

Advertisment
Advertisment
తాజా కథనాలు