Jobless Barbers Row: కులతత్వ మనస్తత్వమే! బీజేపీ, డీఎంకే మధ్య ఆగని రచ్చ!

తమిళనాడు డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. బీజేపీ ఐటీ విభాగాన్ని ‘నిరుద్యోగ క్షురకులు’తో పోల్చారు. ఇది ఆయన 'ఉన్నత-కులతత్వ మనస్తత్వాన్ని' చూపిస్తోందని బీజేపీ ఎదురుదాడి చేసింది.

New Update
Jobless Barbers Row: కులతత్వ మనస్తత్వమే! బీజేపీ, డీఎంకే మధ్య ఆగని రచ్చ!

కుల వృత్తులను తక్కువ చేసి మాట్లాడడం.. అది ఏదో సాధారణ విషయం అన్నట్టు ఫీల్ అవ్వడం చాలా మందికి అలవాటు. వృత్తులను అవమాపరచడం అంటే ఆ పనుల్లోనే జీవితం గడిపే వారిని అవమానపరచడమే అవుతుంది. ఓవైపు హిందీ రుద్దుడు, హిందీ నేర్చుకోనుడు మస్ట్ అంటూ ఉత్తరాది పార్టీ అయిన జేడీయూ అధినేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత డీఎంకేకు చెందిన పాత వీడియోలను బీజేపీ(BJP) ఐటీ సెల్‌ పోస్ట్ చేయడం.. ఆ తర్వాత బీజేపీకి చెందిన ఓల్డ్ వీడియోలను డీఎంకే పోస్ట్ చేయడం.. ఇలా రోజులు గడుస్తున్న ఈ సోషల్‌మీడియా యుద్ధానికి ముగింపే లేదాననిపిస్తోంది. ముందుగా బీహార్‌, యూపీ వాళ్లని మరుగు దోడ్లు శుభ్రం చేసుకునే వారని డీఎంకే(DMK) ఎంపీ దయానిధి మారన్‌(Dayanidhi Maran) చెప్పిన పాత వీడియోను బీజేపీ పోస్ట్ చేయగా.. ద్రవిడియన్లు(దక్షిణాది) నల్లగా ఉంటారని బీజేపీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ 2017లో చేసిన వ్యాఖ్యలను డీఎంకే తాజాగా షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దయానిధికి చెందిన మరో వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.


'వాళ్లంతా జాబ్‌లెస్‌ బార్బర్స్‌:'
తమిళనాడు డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. బీజేపీ ఐటీ విభాగాన్ని ‘నిరుద్యోగ క్షురకులు’తో పోల్చారు. ఐటీ సెల్‌ సభ్యులు చేసేదేమీ లేకపోవడంతో పాత వీడియోలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులోని హిందీ మాట్లాడే రాష్ట్రాలలో ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారి గురించి నాలుగేళ్ల నాటి తన ప్రసంగం వీడియో వైరల్ అయిన తర్వాత, మారన్ తన మొదటి ప్రతిస్పందనలో బిజెపిని విమర్శించడానికి ఒక తమిళ సామెతను ఉదహరించారు. దయానిధి మారన్‌ మాట్లాడుతూ.. 'మంగలి పని లేనప్పుడు పిల్లి తల గుండు చేస్తాడని' తమిళంలో ఒక సామెత ఉంది. అదే విధంగా, బీజేపీకి చెందిన ఐటీ వింగ్ చేసే పని ఏమీ లేదని.. అందుకే తన పాత వీడియోలను ప్రచారం చేస్తోందని చెబుతున్నాడు. అదే సమయంలో, దయానిధి మారన్ మంగలి ప్రకటనను బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. మారన్ క్షురకుల సంఘాన్ని అవమానించారని మండిపడుతోంది.

కించపరచడమే:
మారన్‌ ప్రకటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. మారన్‌కు కేవలం వృత్తి లేదా భాష ద్వారా ఒకరిని కించపరచడం మాత్రమే తెలుసంటూ ఫైర్ అయ్యారు. మారన్ వ్యాఖ్య ఆయన 'ఉన్నత-కులతత్వ మనస్తత్వాన్ని' ప్రదర్శిస్తుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా అన్నారు. 'సనాతన్, హిందూ మతం, ఉత్తర భారతీయులను అవమానించిన తరువాత, ఇప్పుడు మారన్ మంగలిని అవమానించాడు. అతని ఉన్నత, కులతత్వ మనస్తత్వాన్ని ప్రదర్శించాడు. రాహుల్ బాబా రైతులు, మెకానిక్‌లు మొదలైన వారితో ఫోటోలు తీయడంలో బిజీగా ఉన్నారు. ఈ ప్రకటన మొహబ్బత్ దుకాన్‌లో భాగమేనా అని ఆయన చెబుతారా?' అని మండిపడ్డారు. మరోవైపు మారన్‌ వ్యాఖ్యలు మొదటి నుంచి ఏదో ఒక కుల వృత్తిని కించపరిచేలా ఉందన్న అభిప్రాయాలు సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి.

Also Read: అయోధ్య రాముడు ఎలా ఉంటాడంటే?…ప్రత్యేకతలివే..!!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?

రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్‌ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

New Update
Jammu Kashmir

Jammu Kashmir

రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్‌ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమైనట్లు అధికారులు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నిఘా వర్గాలు ఈ విషయాలను పసిగట్టినట్లు సమాచారం.

Also Read:BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

జమ్మూ కశ్మీర్‌ లో పని చేసే స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా అక్కడ పని చేస్తున్న రైల్వే ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లినవారే.దీంతో దాడుల ముప్పు దృష్ట్యా రైల్వే భద్రతా సిబ్బంది తమ బ్యారక్‌ ల నుంచి బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read: Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

మరోవైపు కశ్మీరీ పండిట్‌ల లక్ష్యంగా దాడులు చేసేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.వీరితో పాటు శ్రీనగర్‌,గాందెర్బల్‌ జిల్లాల్లోని పోలీసు సిబ్బందికి కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉదన్న వార్తల నేపథ్యంలో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి.

రైల్వే ప్రాజెక్టులను ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆర్పీఎఫ్‌ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

Also Read:Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

Also Read: Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?

jammu-kashmir | jammu kashmir attack | latest-news | latest-telugu-news | latest telugu news updates | attack in Pahalgam | Pahalgam attack | army

 

Advertisment
Advertisment
Advertisment