AP News: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా!
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదించినట్లు తెలుస్తోంది. 2022 మార్చిలో ఆయన ఏపీపీఎస్సీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు.
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదించినట్లు తెలుస్తోంది. 2022 మార్చిలో ఆయన ఏపీపీఎస్సీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను టీడీపీ సర్కార్ ఏం చేయబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు వాలంటీర్లను కొనసాగిస్తారా? లేక వ్యవస్థనే తొలగిస్తారా? పవన్ చెప్పిన ప్రత్యామ్నాయ ఉపాధి ఏమిటనేది చర్చనీయాంశమైంది.
ఏపీలో ఈ నెల 28న జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. పరిపాలన కారణాలతోనే గ్రూప్-2 పరీక్షను ఏపీపీఎస్సీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఏపీలో టెట్, మెగా డీఎస్సీ పరీక్షల తేదీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ పరీక్ష నిర్వహణ కు 90 రోజులు, మెగా డీఎస్సీ నిర్వహణ కు 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
TG: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు. అలాగే రైతు భరోసా నిధులు కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ నెలలో జరగబోయే టెట్ సిలబస్ పై ఏపీ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 2024లో టెట్ పరీక్షకు కేటాయించిన సిలబస్ తో జూలై 2024 పరీక్ష జరగబోతుందని తెలిపింది. అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని అధికారులు సూచించారు.
డిగ్రీ అర్హతతో 102 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ బ్యాంక్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2024 జులై 14 వరకూ ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అధికారిక వెబ్ సైట్: https://www.indianbank.in/career/
గల్ఫ్‌లో మనం ఆశించిన దానికంటే ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పని కోసం దుబాయ్ వెళతారు. ఇప్పుడు కార్మికుల నుంచి అధికారుల వరకు అందరికీ అక్కడ ఎంత జీతం అందుతుందో చూద్దాం.
ఎలాంటి విమర్శలకు తావీయకుండా మెగా డీఎస్సీ నిర్వహించాలని ఏపీ విద్యశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సిలబస్ లో ఎటువంటి మార్పులు చెయ్యలేదన్నారు. 2024 ఫిబ్రవరి సిలబస్ తోనే డీఎస్సీ నిర్వహిస్తామని, తప్పుడు ప్రచారం నమ్మొద్దన్నారు.