AP TET: ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల
ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదలైంది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఈ టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అప్లికేషన్ లింక్ ఇదే https://aptet.apcfss.in/
ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదలైంది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఈ టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అప్లికేషన్ లింక్ ఇదే https://aptet.apcfss.in/
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్సైట్ upsc.gov.inలో అందుబాటులో ఉంచింది. మెయిన్స్ ఎగ్జామినేషన్ 2024 సెప్టెంబర్ 20న జరగనుంది.
తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని ప్రభుత్వం నియమించనుంది. నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్కూల్ భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2,000 కోట్లతో పనులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో 6128 క్లర్క్ పోస్టుల భర్తీకి IBPS నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జులై 1-21 వరకూ ఆన్ లైన్ వేదికగా అప్లై చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాల కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
ఏపీలో టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అంతా రెడీ అయ్యింది. జులై 1 న టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి..జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి.
ఏపీలో ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్ ను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. 6,100 టీచర్ పోస్టుల ప్రకటన క్యాన్సిల్ చేసి 16,347లతో మెగా డీఎస్సీని ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
10-12వ తరగతి విద్యార్థులకు సంవత్సరానికి రెండుసార్లు సీబీఎస్ ఈ బోర్డు ఎగ్జామ్ నిర్వహించే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ కొత్త నమూనా మొదటి పరీక్ష జనవరి 2026లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఆసక్తి లేనివారు ఏదైనా ఒక పరీక్షకు హాజరు కావచ్చని తెలిపింది.
దేశ సముద్ర సరిహద్దులను కాపాడే వారే ఇండియన్ కోస్ట్ గార్డ్స్. ఇందులో సెయిలర్, మెకానిక్ పోస్టుల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్మీడియట్ పాస్ అయినవాళ్లు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్‌కు జూలై 3 చివరి తేది!
కేంద్రం ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం వెల్లడించింది.7వ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర ఆరోగ్య సేవల CGHSలో లబ్ధిదారుల తమ CGHS IDలను (Abha) IDతో లింక్ చేయాలని తెలిపింది.ఇప్పుడు కేంద్రం ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది.