Group-1: గ్రూప్1 పరీక్షా కేంద్రంలో కలకలం.. గోడ దూకిన అభ్యర్థి!

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా కేంద్రంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లోని ఓ ఎగ్జామ్ సెంటర్‌కు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి మాథ్యూస్‌ గోడదూకి పరీక్షా హాల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అతన్ని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  

New Update
se edre

Group-1: తెలంగాణలో సోమవారం మొదలైన గ్రూప్-1 మెయిన్స్ ఓ పరీక్షా కేంద్రంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లోని పరీక్షా కేంద్రానికి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాల్సిన ఓ అభ్యర్థి నిమిషం ఆలస్యంగా వచ్చారు. దీంతో సెక్యూరిటీ అతడిని లోపలికి అనుమతించకపోవడంతో గోడ దూకి పరీక్షా హాల్ వైపు పరుగెత్తాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు గ్రూప్-1 అభ్యర్థి మాథ్యూస్‌ను అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

చివరి నిమిషంలో పోలీసులు సాయం.. 

ఇదిలా ఉంటే.. మరో పరీక్షా కేంద్రానికి వస్తున్న అభ్యర్థికి ఆలస్యం కావడంతో తెలంగాణ పోలీసులు సహాయం చేశారు. ట్రాఫిక్ సమస్యతో తంటాలుపడుతున్న ఓ అభ్యర్థిని చివరి నిమిషంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో గీతాంజలి కాలేజీ పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు కీసర ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. పోలీసులపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: మనిషి బూడిదకు రూ.400 కోట్లు.. చితాభస్మంలో విలువైన లోహాలు!

ప్రశాంతంగా ముగిసిన మొదటి పరీక్ష..

తెలంగాణలో బందోబస్తు మధ్య గ్రూప్-1 మెయిన్స్‌ మొదటి పేపర్ పరీక్ష ముగిసింది. మొదటి రోజు ఇంగ్లీష్ పేపర్ కు భారీగా హాజరు శాతం నమోదైంది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసిన అధికారులు.. ఆలస్యంగా వచ్చినవారిని లోపలికి అనుమతించలేదు. ఇక పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ విధించారు. పరీక్ష  కేంద్రాల దగ్గరలో 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఎవరినీ ఉండనివ్వలేదు. 

ఇది కూడా చదవండి: సల్మాన్‌కు ఆ విషయం తెలియదు.. మాజీ ప్రేయసి సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు