/rtv/media/media_files/2025/03/01/2TIdQ7MsDrPIcyaQc3NJ.jpg)
SSC CGL 2024 final vacancy of 18174 posts out
SSC CGL Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గతంలో 17,727 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఈ సారి మాత్రం మొత్తం 18,174 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కంబైన్‌డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (CGL) ద్వారా ఈ మొత్తం ఖాళీలను ఎస్ఎస్సీ భర్తీ చేయనుంది. అందువల్ల ఆసక్తిగల అభ్యర్థులు ssc.gov.in వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
అర్హతలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఏదైనా డిగ్రీ అర్హత సాధించి ఉండాలి. దీంతోపాటు పోస్టుల వారీగా మరిన్ని విద్యార్హతలు నిర్ణయించారు.
Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
దరఖాస్తు:
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:
టైర్-1, టైర్-2 పరీక్షల ద్వారా.. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి
జీతం:
పోస్టులను బట్టి నెలకు రూ.25,500 నుంచి రూ.1,42,400 వరకు జీతం ఉంటుంది. అలవెన్సులు అదనంగా ఉంటాయి.