సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1785 ఖాళీలు..అర్హతలు, చివరి తేదీ వివరాలు ఇవే!

కోల్‌కతాలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ - సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1,785 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. డిసెంబర్ 27లోపు దరఖాస్తు చేసుకోవాలి.

New Update
jobs,

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పశ్చిమ్‌ బెంగాల్‌ కోల్‌కతాలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC)- సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. SER పరిధిలోని డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

Also Read : సుకుమార్ ఆ సినిమాను మొదట బన్నీతో చేయాలనుకున్నాడా?

మొత్తం 1,785 అప్రెంటిస్ ఖాళీలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,785 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే 01.01.2025 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే?

ఫిట్టర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్,  మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, ఎంఎంటీఎం, లైన్‌మ్యాన్, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్, టర్నర్, రిఫ్రిజిరేటర్ అండ్‌ ఏసీ మెకానిక్ తదితర ట్రేడుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇక దీని ఎంపిక విధానం విషయానికొస్తే..

Also Read:  విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్

అభ్యర్థులను మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. అందువల్ల ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 28, 2024న ప్రారంభం అయింది. డిసెంబర్ 27, 2024 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు