JEE Main 2025: జేఈఈ మెయిన్స్‌ రెండో విడత పరీక్షలు వాయిదా..! కారణం ఏంటంటే?

జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత పరీక్షల తేదీలు ఛేంజయ్యే అవకాశం కన్పిస్తోంది. ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా.. అదే సమయంలో సీబీఎస్‌ఈ పరీక్షలు ఉన్నాయి. దీంతో రెండు పరీక్షల మద్య క్లాష్ రానుండటంతో తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది.

New Update
JEE Main 2025 Session 2 Exam Dates Changed for CBSE Board Exams Clash

JEE Main 2025 Session 2 Exam Dates Changed for CBSE Board Exams Clash

జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) అభ్యర్థులకు బిగ్ అలర్ట్. మెయిన్ 2025 తుది విడత పరీక్షల తేదీలు ఛేంజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో ఈ జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నట్లు మొదట షెడ్యూల్‌లో తెలిపారు. అందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులను సైతం ఇవాళ (మార్చి29)న NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) రిలీజ్ చేసింది. 

Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

JEE Main 2025 Revised

అయితే ఇప్పుడు ఆ తేదీల్లోని పరీక్షలు వాయిదా పడే అవకాసం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షలే. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షల తేదీల్లో CBSE పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇది వరకే బోర్డు ప్రకటించింది. 

Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

ఇందులో భాగంగానే ఏప్రిల్ 1వ తేదీన లాంగ్వేజెస్, ఏప్రిల్ 3వ తేదీన హోం సైన్స్, ఏప్రిల్ 4వ తేదీన ఫిజియాలజీ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనున్నాయి. మరోవైపు JEE మెయిన్స్‌ ఎగ్జామ్స్ సైతం అవే టైమింగ్స్‌లో జరగనున్నాయి. ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లోనూ వీటిని నిర్వహించనున్నారు. అందులో ఫస్ట్ షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. సెకండ్ షిఫ్ట్‌ సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించనున్నారు. 

Also Read: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు షాక్.. బహిష్కరిస్తున్నమంటూ మెయిల్స్!

దీంతో ఈ రెండు ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఒక పరీక్షకు హాజరైతే.. మరొక పరీక్ష మిస్ కావాల్సి ఉంటుంది. ఇలా రెండు ఎగ్జామ్స్ తేదీలు క్లాష్ కావడంతో చాలా మంది విద్యార్థులు కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ అంశంపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వ అధికారులు సమీక్షించారు. ఈ పరీక్షల తేదీలు మార్పు చేయడం లేదా ప్రత్యామ్నాయాలపై నిర్ణయం తీసుకోవాలని NTAకి కేంద్ర సూచించింది. ఈ అంశంపై ఆఖరి నిర్ణయం ఇవాళ తేలనుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. 

Also Read: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి

(jee mains 2025 | jee-main-exam-date | cbse-board | cbse-board-exams | cbse-board-exams-schedule | latest-telugu-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment