డిగ్రీ ఉంటే చాలు.. IDBI బ్యాంక్‌లో మేనేజర్ అయ్యే గోల్డెన్ ఛాన్స్.. ఏడాదికి రూ.6.5 లక్షల ప్యాకేజీ!

నిరుద్యోగులకు IDBI బ్యాంక్  అదరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్ 'O' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన వారు ఏడాది పాటు పీజీ డిప్లొమా కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.

New Update
idbi

నిరుద్యోగులకు IDBI బ్యాంక్  అదరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్ 'O' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన వారు ఏడాది పాటు పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (PGDBF) కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.

మార్చి 8 అంటే ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. మార్చి 19వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష ఏప్రిల్ 12వ తేదీన జరుగుతోంది. మొత్తం 1,100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిని జోన్ల వారీగా విభజించారు. తెలుగు రాష్ట్రాల్లో65 పోస్టులు ఉండగా,  కర్ణాటకలో 75, తమిళనాడులో 70,మహారాష్ట్ర (ముంబై, నాగ్‌పూర్ కలిపి) 180, ఢిల్లీ-NCR & రాజస్థాన్ లో 130 ఇతర రాష్ట్రాల్లో మిగిలిన ఖాళీలు ఉన్నాయి.

దీనికి విద్యార్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. (జనరల్/EWS/OBC అభ్యర్థులకు 60%, SC/ST/PwBD అభ్యర్థులకు 55% మార్కులు తప్పనిసరి). కేవలం డిప్లొమా ఉన్నవారు అనర్హులు. వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. (SC/STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది). కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

 జనరల్, OBC, EWS అభ్యర్థులకు రూ. 1,050. SC, ST, PwBD అభ్యర్థులకు రూ. 250 ఫీజు ఉంటుంది. 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. సమయం 120 నిమిషాలు ఇస్తారు. అన్ లైన్ ఎగ్జామ్ తరువాత ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 6.14 లక్షల నుండి రూ. 6.50 లక్షల వరకు ప్యాకేజీ ఉంటుంది. 

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే 

ముందుగా IDBI బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు ఫారమ్ నింపండి.ఫోటో, సంతకం, ఎడమచేతి బొటనవేలు ముద్ర మరియు డిక్లరేషన్‌ను అప్‌లోడ్ చేయండి. ఫీజు చెల్లించి, ఫారమ్ సబ్మిట్ చేయండి.  ఆ తరువాత ఓ ప్రింట్ అవుట్ తీసుకోండి.

Advertisment
తాజా కథనాలు