GATE 2025: GATE ఫలితాలు విడుదల.. డౌన్‌లోడ్‌ ఆలస్యం చేస్తే రూ.500 ఫైన్!

GATE 2025 (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) ఫలితాలు విడుదలయ్యాయి. పరిక్ష రాసిన అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌లో https://goaps.iitr.ac.in/login ఫలితాలు చూసుకోవచ్చు. మే 31 తర్వాత డౌన్‌లోడ్‌ చేసినవారు ప్రతి పేపర్‌కు రూ.500 చెల్లించాలి.

New Update
JOBS: SSC CHSL తుది ఫలితాలు విడుదల..!

GATE 2025 results released

GATE 2025: GATE 2025 (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) ఫలితాలు విడుదలయ్యాయి. పరిక్ష రాసిన అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌లో https://goaps.iitr.ac.in/login ఫలితాలు తెలుసుకోవచ్చు. మే 31 తర్వాత డౌన్‌లోడ్‌ చేస్తే రూ.500 చెల్లించాలి. ఇక రిజ్టల్ట్స్ కోసం అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ/ఈ-మెయిల్‌ అడ్రస్‌, పాస్‌వర్డ్‌ వంటి వివరాలను ఎంటర్‌ చేసి స్కోరు కార్డు పొందొచ్చు. 

మార్చి 28 నుంచి మే 31వరకు..

ఈ మేరకు దేశంలోని IITలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో M Tech, PHD కోర్సుల్లో ప్రవేశాలకు మొత్తం 30 సబ్జెక్టులకు నిర్వహించిన GATE పరీక్ష ఫలితాలను అధికారులు రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 8.37 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా సుమారు 80 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో పరీక్షలు జరగగా.. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేశారు ఐఐటీ రూర్కీ అధికారులు. అయితే తాజాగా రిలీజ్ చేసిన స్కోరు కార్డులు మార్చి 28 నుంచి మే 31వరకు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ గడువు దాటిన తర్వాత స్కోర్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకున అభ్యర్థులు ప్రతి పరీక్ష పేపర్‌కు రూ.500 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read :   లక్ష కోట్లు పోగొట్టుకున్న అదానీ..అధిక సంపద కోల్పోయిన వారిలో సెకండ్

ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్‌లలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లు, డైరెక్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి గేట్ స్కోర్‌లను ఉపయోగిస్తారు. స్కాలర్‌షిప్‌లతో పాటు కొన్ని కళాశాలలు, సంస్థలు స్కాలర్‌షిప్‌లు లేకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి గేట్ స్కోర్‌లను కూడా ఉపయోగిస్తాయి. 

Also read :  విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త...ఇకపై ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు

1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు
2. IIT బాంబే
3. IIT ఢిల్లీ
4. IIT గౌహతి
5. IIT కాన్పూర్
6. IIT ఖరగ్‌పూర్
7. IIT మద్రాస్
8. IIT రూర్కీ

Advertisment
Advertisment
Advertisment