TGPSC GROUP 1: గ్రూప్-1 మెయిన్స్ పై సీఎస్ కీలక ఆదేశాలు! తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 21నుంచి 27వరకు జరిగే పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలు సీసీ టీవీ నిఘాలో ఉంటాయన్నారు. By srinivas 17 Oct 2024 in జాబ్స్ హైదరాబాద్ New Update షేర్ చేయండి TGPSC GROUP-1: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై సీఎస్ శాంతి కుమారి కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 21నుంచి 27వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ మీటింగ్ లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయం నుండి కమీషన్ చైర్మన్ డా. మహేందర్ రెడ్డి, సభ్యులు పాల్గొనగా.. సచివాలయం నుండి డీజీపీ జితేందర్, కమీషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, SPDCL MD ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: Ind Vs Nz: టెస్టుల్లో మరో చెత రికార్డ్ క్రియేట్ చేసి భారత్! ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. దీనికోసం 46 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశాం. ఈ పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేశాం. జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారు. సంబంధిత పోలీస్ కమీషనర్లు కూడా తగు బందోబస్తు ఏర్పాట్లను చేపడుతారు. అన్ని శాఖల అధికారులు ఏవిధమైన స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా ఈ పరీక్షల నిర్వహణా విధులు నిర్వహిస్తారని వివరించారు. ఇది కూడా చదవండి: దాని కోసం మందు అలవాటు చేసుకున్నాను.. షారుక్ మాటలు వింటే.. సవాలుతో కూడిన నిర్వహణ.. ఇక TGPSC చైర్మన్ డా. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 2011 సంవత్సరం అనంతరం గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. కొన్ని సంవత్సరాల అనంతరం జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ప్రతీ అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ఆక్టివ్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటున్నదని, ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి అన్నారు. గ్రూప్ -1 జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృతమైన బందోబస్తు తోపాటు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు చేపట్టామని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణలో మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ ! కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తాం.. TGPSC కార్యదర్శి నవీన్ నికోలస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీలను ఏర్పాటుచేసి, TGPSC కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ప్రతి స్టెప్ లోనూ కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలు అందచేశామని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు, మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే, 85 శాతం అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంటను అదనంగా కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇది కూడా చదవండి: డకౌట్లో తిరుగులేని వీరులు.. కోహ్లీ, రోహిత్ ఆల్టైమ్ రికార్డు! ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.. ఎవరికైతే పరీక్ష రాయడానికి సహాయకులు (స్క్రైబ్ ) అవసరమో, ఆ అభ్యర్థుల హాల్ టికెట్లపై ప్రత్యేకంగా పేర్కొనడం జరిగిందని, స్క్రైబ్ ల సహాయంతో పరీక్షలు వ్రాసే వారికి ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి వెల్లడించారు. అన్నిపరీక్షా కేంద్రాల 46 వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్ తెలిపారు. నిరంతరం విధ్యుత్ సరఫరా అందించేవిధంగా చర్యలు చేపట్టినట్టు, ఇందుకుగాను ముగ్గురు సి.ఈ లు పర్యవేక్షిస్తారని SPDCL ఎండీ ముషారఫ్ అలీ అన్నారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. #telangana-news #tgpsc-group-1 #cs-shanthi-kumari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి