/rtv/media/media_files/2025/03/23/mIv6xDpfXlfVV7J8nghj.jpg)
Inter exams cancellation Photograph: (Inter exams cancellation)
పేపర్ లీక్ కారణంగా ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఎగ్జమ్స్ రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. మార్చి 21న జరిగిన ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఎగ్జా్మ్‌లో 10 జిల్లాల్లోని 15 ఎగ్జామ్ సెంటర్‌లో మ్యాథ్స్ పేపర్ లీక్ అయ్యిందని తేలింది. దీంతో ప్రభుత్వం ఎగ్జామ్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. మూడు ప్రభుత్వ విద్యాసంస్థలు సహా 18 స్కూల్స్‌లో ఉంచిన మ్యాథ్స్ పేపర్ సీల్ తీసి సోషల్ మీడియాలో లీక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అస్సాం హైయర్ సెకండరీ బోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మార్చి 24 నుంచి 29 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేసింది. అంతేకాదు అస్సాంలోని బార్‌పేట జిల్లాలో 9వ తరగతి ఇంగ్లీష్ వార్షిక పరీక్షా పేపర్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దీంతో ఆ పరీక్షను రద్దు చేశారు.
Also read: Terrorists: సరిహద్దులో కాల్పుల కలకలం.. ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్
Due to reports of question paper leak and breach of protocol, the remaining subjects of HS First Year Examination 2025 (scheduled from 24–29 March) stand cancelled. Further action will be decided in the Board meeting on 24 March.@himantabiswa @CMOfficeAssam pic.twitter.com/fFFUHyWKiG
— Ranoj Pegu (@ranojpeguassam) March 22, 2025
Also read: SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దును అస్సాం విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు ధృవీకరించారు. షెడ్యూల్ పరీక్షకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రభుత్వ విద్యాసంస్థలతో సహా 18 స్కూల్స్‌లో భద్రతా ఉల్లంఘనలు జరిగినట్లుగా గుర్తించామని తెలిపారు. 10 జిల్లాల్లోని 15 ప్రైవేట్ స్కూల్స్ గుర్తింపును బోర్డు సస్పెండ్ చేసినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన మరో మూడు స్కూల్స్‌పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. 11వ తరగతి పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను బోర్డు అధికారులు తర్వలో ప్రకటిస్తారని ఎక్స్‌లో పేర్కొన్నారు.